మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), ‘హలో’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘చిత్రలహరి’,‘రణరంగం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. నటనకు మించిన ప్రేరణ ఆమెకు కుటుంబమే. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, అలనాటి స్టార్ హీరోయిన్ లిస్సీలకు జన్మించింది.చిన్నతనం నుంచి సినిమాల పట్ల ఆసక్తి కనబరిచింది. విద్యను ప్రాధాన్యం ఇచ్చి న్యూయార్క్‌లో ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాతే ఆ సినిమాల్లో అడుగు పెట్టింది.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, పలు చిత్రాల్లో నటించి అనుభవాన్ని సంతరించుకుంది. మలయాళ చిత్రం ‘ఆంటోనీ’ తెలుగు ప్రేక్షకులమధ్య మంచి విజయాన్ని సాధించగా, తాజాగా ‘లోక చాప్టర్ 1 (Lokah Chapter 1): చంద్ర’లో చూపించిన ఆమె ప్రతిభ, ప్రత్యేకంగా యాక్షన్ సీన్స్ ,భావోద్వేగ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘చంద్ర’ పాత్రలో సాధారణ కమర్షియల్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా, ఫైట్స్, క్రీయాశీల సీన్స్‌లో నైపుణ్యం చూపించడంతో, ఇండియన్ మొదటి సూపర్ ఉమెన్ హీరోగా గుర్తింపు పొందింది.
న్యూయార్క్‌లో ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి
కళ్యాణి తన వ్యక్తిగత జీవితం గురించి కూడా అభిమానులతో పంచుకుంది. “మా స్వస్థలం కేరళ అయినప్పటికీ, నేను చెన్నై (Chennai) లో పుట్టి పెరిగాను. చిన్నప్పుడు తల్లిదండ్రులతో షూటింగ్లకు వెళ్ళేవన్నీ, సినిమాలపై ఆసక్తిని పెంచాయి. చదువు పూర్తయిన తరువాతే సినిమాల్లో అడుగు పెట్టమని నాన్న ఆదేశించారు. అందుకే న్యూయార్క్‌లో ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి చేసి 2017లో ‘హలో’లో హీరోయిన్‌గా అవకాశాన్ని పొందాను” అని ఆమె తెలిపారు.
ఇప్పటివరకు నేను సరదా పాత్రలే చేయగా.. ‘కొత్తలోక’లో మొదటిసారి యాక్షన్ సీక్వెన్స్ చేశారు. ఈ సినిమా కోసం ఆర్నెల్లు ట్రైనింగ్ తీసుకున్నాను. ఇండస్ట్రీలో కొనసాగాలంటే శరీరాకృతి మెయింటైన్ చేయాలి. అందుకే ఫిట్‌గా ఉండేందుకు రోజూ గంటన్నరసేపు ఎక్సర్‌సైజ్ చేస్తా. అరగంట సేపు గోల్ఫ్ ఆడతాను. సినీ ఇండస్ట్రీలో నాకు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) బెస్ట్ ఫ్రెండ్. ఐదేళ్ల క్రితం మేమిద్దరం కలిసి ‘వరణే అవశ్యముంద్’ చిత్రంలో నటించాం.
అనాథాశ్రమంలో ఉంచారు
అప్పటినుంచి మంచి స్నేహితులయ్యాం. నాకు ఏ కష్టమొచ్చినా, సలహా కావాలన్నా మొదటి ఫోన్ దుల్కర్ సల్మాన్‌కే చేస్తాం. మేమిద్దరం కలిశామంటే చిన్నపిల్లల్లా మారిపోయి అల్లరి చేస్తుంటాం’మా పూర్వీకులది కూర్గ్ ప్రాంతం. నాకు ఖాళీ దొరికితే అక్కడికి వెళ్లి కాఫీ తోటల్లో ఎంజాయ్ చేస్తుంటా. విదేశాల్లో అయితే సియోల్ (Seoul) ప్రాంతం చాలా ఇష్టం. అక్కడికి మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంటుంది. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. కళ్లముందు ఐటెమ్స్ కనిపించాయంటే అస్సలు ఆగలేను. ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్తే బిర్యానీ, పానీపూరీ కుమ్మేస్తా.
అరటిపండు పాయసం అంటే చాలా ఇష్టం. నా దృష్టిలో అందం అంటే పైకి కనిపించేది కాదు. ఆత్మవిశ్వాసమే అసలైన అందం.నా ఫేవరెట్ హీరోయిన్స్ సాయిపల్లవి (Sai Pallavi), వారియర్, శోభన, అలియాభట్. నాకు ఓ తమ్ముడు ఉన్నాడు. వాడిపేరు సిద్దార్థ్. ఎంత ఆస్తి ఉన్నా జీవితం విలువ తెలియాలన్న ఉద్దేశంతో అమ్మానాన్న మా ఇద్దరిని చిన్నతనంలో వియత్నాంలోని ఓ అనాథాశ్రమంలో ఉంచారు. అక్కడ అనాథ పిల్లలతో కలిసి ఉంటూ వాళ్లు తినే ఆహారమే తిన్నాం. నేలపైనే పడుకున్నాం. ఆ అనుభవం జీవితం విలువ ఏంటో నేర్పించింది’ అని చెప్పుకొచ్చింది కళ్యాణి ప్రియదర్శన్.
Read hindi news: hindi.vaartha.com
Read Also: