నటి కల్పిక (Kalpika) పై ఇటీవల గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ (Prism Pub)లో జరిగిన ఘర్షణ కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. అక్కడ పనిచేసే సిబ్బంది ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గొడవ సమయంలో కల్పిక వ్యవహరించిన తీరుపై సిబ్బంది అభ్యంతరం తెలుపడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై మరో కేసు
ఇక రెండవ కేసు… కల్పిక (Kalpika) పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కొందరి వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, తప్పుదారి పట్టే విధంగా పోస్టులు పెడుతోందని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ శాఖ కూడా కల్పికపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
హైకోర్టు ఆదేశాలతో కల్పికకు తాత్కాలిక ఊరట
ఈ రెండు కేసులపై నటి కల్పిక హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయవద్దని విజ్ఞప్తి చేసిన ఆమెకు తాత్కాలిక ఊరట లభించింది. విచారణ సందర్భంగా హైకోర్టు, ప్రస్తుతం నమోదైన రెండు కేసుల్లో ఆమెను అరెస్ట్ చేయవద్దని పోలీసులు ఆదేశించింది. అయితే, విచారణ కోసం అవసరమైనప్పుడు సహకరించాల్సిందిగా సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Mahavatar Narasimha: 5 రోజుల్లోనే రూ.30 కోట్లు రాబట్టిన మహావతార్ నరసింహ