📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News :Kalki 2898 AD: దీపికా ఔట్ – సాయి పల్లవి ఇన్

Author Icon By Pooja
Updated: October 6, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన కల్కి (Kalki 2898 AD) రికార్డులు సృష్టించింది. సై-ఫై డ్రామాతో పాన్ ఇండియా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మైండ్‌బ్లోయింగ్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు సీక్వెల్ అంటే అభిమానుల్లో కల్కి (Kalki 2898) ADమరింత ఎగ్జైట్మెంట్. అయితే, హీరోయిన్ మార్పు వార్తలు సీక్వెల్‌పై కొత్త సస్పెన్స్ క్రియేట్ చేశాయి.

Read also: Cough Syrup:దగ్గుమందు ప్రమాదకర రసాయనమా?

దీపికా స్థానంలో సాయి పల్లవి?

సినీ వర్గాల సమాచారం ప్రకారం, మొదటి పార్ట్‌లో కనిపించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె స్థానంలో, రెండో పార్ట్‌లో సాయి పల్లవిని(Sai Pallavi) తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించారట.దీపికా పని గంటల విషయంలోని డిమాండ్లు, యాటిట్యూడ్ మేకర్స్‌కు ఇబ్బందులు కలిగించడంతో ఆమెను తప్పించారని గాసిప్ వినిపిస్తోంది. ఈ కారణంగానే కొత్త ఫేస్ కోసం మేకర్స్ వెతకాల్సి వచ్చిందట. తాజా బజ్ ప్రకారం, సాయి పల్లవికి ఈ సినిమాలో నటించేందుకు రూ. 8 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఈ స్థాయి రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్లు చాలా తక్కువ.ఇంత పెద్ద ఆఫర్ రావడం సాయి పల్లవి రేంజ్ ఎంత పెరిగిందో చూపిస్తోంది.

అలియా భట్ కూడా రేస్‌లో?

మొదట దీపికా స్థానంలో అలియా భట్ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచించారట. కానీ ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ప్రాజెక్ట్‌కు అంగీకరించలేకపోయిందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ ఆఫర్ సాయి పల్లవికి వెళ్లిందట. సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ప్రభాస్ – సాయి పల్లవి కాంబినేషన్ పెద్ద తెరపై కనబడటమే అభిమానులకు ఓ ట్రీట్ అవుతుంది. స్క్రీన్‌పై వారి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక సాయి పల్లవి క్లాసీ రోల్స్లోనూ, మాస్ అటిట్యూడ్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ సెట్ చేసుకుంది. అలాంటి ఆమెను పాన్ ఇండియా సై-ఫై డ్రామాలో చూడటం కొత్త అనుభవం అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.

కల్కి 2898 AD పార్ట్ 2లో దీపికా ఎందుకు లేరు?
దీపికా డిమాండ్లు, వర్క్ షెడ్యూల్ ఇష్యూల కారణంగా మేకర్స్ ఆమెను తప్పించినట్లు టాక్.

సాయి పల్లవికి ఎంత పారితోషికం ఆఫర్ చేశారు?
సాయి పల్లవికి దాదాపు రూ. 8 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper :https://epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu DeepikaPadukone Kalki2898AD KalkiPart2 Latest News in Telugu Prabhas SaiPallavi Telugu News Today TollywoodNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.