బాలీవుడ్ లో ప్రధాన తారలు కాజోల్, ట్వింకిల్ ఖన్నా ప్రైమ్ వీడియోలో కొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ షోకి “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్” (Two much with Kajol and Twinkle Khanna) అనే పేరును పెట్టారు. ఇప్పటికే “కాఫీ విత్ కరణ్” వంటి షోలు భారతీయ ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నేపథ్యాన్ని అనుసరించి, ఈ షో కూడా ప్రముఖ సెలబ్రిటీలతో ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ ఇంటర్వ్యూలను అందించనుంది.
ఈ కొత్త షోలో కాజోల్ (Kajol), ట్వింకిల్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తారు. వారు ప్రతి ఎపిసోడ్‌లో తాము ఆత్మీయంగా, హాస్యభరితంగా సెట్‌లో ఉండి, అతిథుల వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం, కొత్త ప్రాజెక్ట్స్, ఫన్ క్వాలిటీస్ గురించి పలు విషయాలు తెలుసుకుంటారు. ఈ విధంగా, ప్రేక్షకులు సెలబ్రిటీ (Celebrity) లను మరింత సమీపంగా, మానవీయ దృక్పథంలో చూడగలుగుతారు.
ఈ షోని సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు నిర్వహాకులు. ఈ సందర్భంగా ఈ షో ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ముఖ్య అతిథులుగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో పాటు ఆమిర్ ఖాన్, జాన్వీ కపూర్, విక్కీ కౌశల్, గోవిందా, కరణ్ జోహార్, కృతి సనన్, ఆలియా భట్ తదితరులు వచ్చి సందడి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: