📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

Latest News: kaantha Movie – దుల్క‌ర్ కాంత సినిమా విడుదల వాయిదా

Author Icon By Anusha
Updated: September 11, 2025 • 7:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళ యువ హీరో, సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తన స్టైలిష్ నటనతో పాటు, మంచి కథలతో ప్రేక్షకులను ఎప్పుడూ కొత్త అనుభూతి కలిగించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఆయన నిర్మాణంలో ఇటీవల విడుదలైన లోక (Loka) సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని రీతిలో సక్సెస్ కావడంతో, ప్రస్తుతం కలెక్షన్లు దూసుకుపోతున్నాయి.

లోక సినిమా విజయంతో దుల్కర్ ఆనందంలో మునిగిపోయాడు. ఒక నిర్మాతగా తనకు ఇది ఎంతో గొప్ప అనుభూతి అని ఆయన చెబుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో కథ ఎంపిక నుంచే అందరి శ్రద్ధని ఆకర్షించేలా ప్రయత్నించామని, ఆ కృషి ఫలితంగా ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణ లభిస్తోందని అన్నారు. ప్రస్తుతం కేరళ (Kerala) తో పాటు, ఇతర రాష్ట్రాల్లో కూడా లోకకు మంచి వసూళ్లు వస్తున్నాయి.

కాంత సినిమాను వాయిదా

అయితే, లోక సినిమా కలెక్షన్ల ప్రభావం దుల్కర్ నటించిన మరో కొత్త సినిమాపై పడింది. ఆయన హీరోగా నటించిన కాంత (Kantha) అనే సినిమా రిలీజ్ కోసం సిద్ధంగా ఉంది. మొదట ఈ నెల 12 న విడుదల చేయాలనుకున్నా, లోక హవా కొనసాగుతున్నందున కాంత సినిమాను వాయిదా వేసినట్లు సమాచారం.

రెండు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్‌లో పోటీ పడితే, ఒకదానికి మరొకదానికి నష్టం జరుగుతుందని భావించి, జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ టాక్.అయితే ఈ సినిమా ప్ర‌స్తుతం మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతుండ‌టంతో త‌న కాంత సినిమా విడుద‌లను వాయిదా వేశాడు దుల్క‌ర్. ఈ విష‌యాన్ని ఎక్స్ (X) వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

kaantha Movie

మా సినిమా ద్వారా మీకు మరింత మెరుగైన అనుభూతి

ప్రియమైన ప్రేక్షకులకు.. ‘కాంత’ టీజర్ విడుదలైనప్పటి నుంచి మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, మద్దతు మా హృదయాలను హత్తుకున్నాయి. మీ అభిమానం మాకు ఎంతో విలువైనది. మా సినిమా ద్వారా మీకు మరింత మెరుగైన అనుభూతిని అందించాలని మేము కోరుకుంటున్నాం. ‘కొత్త లోక’ ఘన విజయం సాధించి, బాక్సాఫీస్‌ (Box office) వద్ద చంద్ర విజయయాత్ర కొనసాగించాలని మేము మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. అదే ఉత్సాహంతో, మిమ్మల్ని మరో అద్భుతమైన సినీ ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి మేము సిద్ధమవుతున్నాం.

దీపావళికి వాయిదా

ఈ నేపథ్యంలో మా చిత్రం ‘కాంత’ విడుదల తేదీని వాయిదా వేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాము. అప్పటివరకు మీ మద్దతు ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాం. త్వరలోనే మీ అందరినీ థియేటర్లలో కలుసుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నాం. అంటూ కాంత టీమ్ రాసుకోచ్చింది.

అయితే, ఈ సినిమా ఇప్పుడు దీపావళికి వాయిదా పడుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి.మ‌రోవైపు ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse), సముద్రకని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/aishwarya-rai-delhi-high-court-gives-crucial-verdict-on-use-of-aishwarya-rais-photos/cinema/545406/

Breaking News kanta movie update kanta new release date kanta release postponed kanta team announcement latest news Telugu News upcoming telugu movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.