📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Jr NTR: ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ కు స్వల్ప బ్రేక్..కారణమిదే?

Author Icon By Anusha
Updated: January 21, 2026 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’పై సినీ అభిమానుల్లో అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.కొన్ని నెలల గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్‌ ను తిరిగి ప్రారంభించిన చిత్రబృందం, హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్‌లో జెట్ స్పీడ్‌తో షూటింగ్ నిర్వహిస్తోంది. అయితే తాజాగా షూటింగ్‌ కు స్వల్ప బ్రేక్ పడింది. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ (Jr NTR) స్వల్ప జలుబుతో బాధపడుతున్నట్లు సమాచారం.

Read Also: CM Revanth: దావోస్ పర్యటనలో ప్రముఖులు

త్వరలోనే షూటింగ్ మళ్లీ ప్రారంభం

ఆరోగ్య సమస్య పెద్దది కాకపోయినా, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో యూనిట్ షూటింగ్‌ ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ సినిమా షూటింగ్‌కు మరోసారి బ్రేక్ వచ్చినప్పటికీ, ఇది కేవలం ఒకటి లేదా రెండు రోజులకు మాత్రమేనని యూనిట్ తెలిపింది.. త్వరలోనే షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని సమాచారం.

Jr NTR: Short break for the shooting of the movie ‘Dragon’..what is the reason?

మొదట 2026 జనవరి 26న విడుదల చేస్తామని ప్రకటించినా, షూటింగ్ ఆలస్యం కారణంగా రిలీజ్‌ను 2027కి వాయిదా వేశారు.ఈ చిత్రంలో, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ మీనన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ ను నిర్మిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dragon Movie latest news Mytri Movie Makers NTR prashanth neel Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.