యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఒక భారీ చిత్రంలో నటిస్తున్న విషయం ఫ్యాన్స్ కోసం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతానికి ఈ సినిమాను “NTR Neel” అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఇప్పటికే షూటింగ్ లో శరవేగంగా సాగుతోంది. సినిమా షూటింగ్ క్రమంలోనే కాకుండా, ఎన్టీఆర్ ప్రమోషనల్ యాడ్స్ కోసం కూడా షూట్ చేస్తూ, అభిమానులను నిరంతరం ఆకట్టుకుంటున్నారు.
ఓ యాడ్ షూటింగ్‌లో ఆయనకు దెబ్బలు తగిలినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఎన్టీఆర్ (Jr NTR) బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఓ కంపెనీ కోసం ఓ కమర్షియల్ యాడ్ షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తుండగా తారక్ కిందపడిపోయారు. దీంతో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. వెంటనే ఆయన్ను దగ్గరలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఎన్టీఆర్ టీమ్ ఈ ప్రమాదంపై స్పందిస్తూ ప్రకటన విడుదల
తారక్ కు గాయాలు అయ్యాయనే వార్త విని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ టీమ్ (NTR Team) ఈ ప్రమాదంపై స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది. తారక్ ఆరోగ్యంగా ఉన్నారని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కాకపోతే రెండు వారాలు రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ చెప్పారని పేర్కొన్నారు.”ఈరోజు ఒక యాడ్ షూటింగ్ లో ఉండగా ఎన్టీఆర్ కు స్వల్ప గాయం అయింది.
వైద్యుల సలహా మేరకు, ఆయన పూర్తిగా కోలుకోవడానికి రాబోయే రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ హామీ ఇస్తున్నాము. ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను అభిమానులు, మీడియా నమ్మొద్దని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం” అని టీం ప్రకటనలో తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: