📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Jr NTR :జూనియర్ ఎన్‌టీఆర్‌ను నేను తిట్టలేదు: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

Author Icon By Anusha
Updated: August 17, 2025 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కారణం, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఆడియో క్లిప్. అందులో ఎమ్మెల్యే ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వచ్చాయి. దీనితో ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.వార్తల ప్రకారం, దగ్గుపాటి ప్రసాద్ వార్ 2 సినిమా ప్రత్యేక షోకు హాజరయ్యారని, ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడని ప్రచారం సాగింది. ఈ వార్తలతో పాటు సోషల్ మీడియాలో ఒక ఆడియో కూడా షేర్ అవ్వడంతో మరింత హడావుడి మొదలైంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న

అయితే, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దీనిపై స్పందిస్తూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. తాను జూనియర్ ఎన్టీఆర్‌పై ఎప్పుడూ అసభ్య వ్యాఖ్యలు చేయలేదని, ఆడియో పూర్తిగా నకిలీదని చెప్పారు. తనను కించపరిచే ఉద్దేశ్యంతోనే కొందరు కావాలనే ఇలా ఫేక్ ఆడియోలు క్రియేట్ చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ (Daggubati Prasad) మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు నారా, నందమూరి కుటుంబాలంటే ఎంతో అభిమానం. జూనియర్ ఎన్టీఆర్‌ను నేను చాలా గౌరవిస్తాను. అలాంటిది నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడటం ఏంటి. ఈ విషయంలో ఆయన అభిమానులు అపార్థం చేసుకుని ఉంటే నన్ను క్షమించాలి’ అని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.

Jr NTR

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి

తనపై అసత్య ప్రచారం చేస్తోన్న నకిలీ వీడియోలు, ఆడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.ఇదిలా ఉంచితే నిన్నటి వరకు సోషల్ మీడియాలో ఒక ఆడియ తెగ హల్చల్ చేసింది. దీనిలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ‌ను అసభ్య పదజాలంతో దూషించినట్లుగా ఉంది. ఆయన సినిమా ప్రదర్శిస్తే.. తగలబెడతానని బెదిరించినట్లుగా ఆడియోలో ఉంది. ఇది కాస్త జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. అయితే ఆ ఆడియోలన్నీ తప్పుగా క్రియేట్ చేసినవి అని.. వీటి ద్వారా తనను రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆయన మండి పడ్డారు. ప్రజలు ఇలాంటి నకిలీ ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

బహిరంగ క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు

ఎన్టీటీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తోన్న ఆడియో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడ ఉద్రిక్తత సృష్టించారు. అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకున్న అభిమానులు.. దగ్గుపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకుని అభిమానులను అడ్డుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన తేదీ ఎప్పుడు?

జూనియర్ ఎన్టీఆర్ 20 మే 1983 న హైదరాబాద్‌లో జన్మించారు.

జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు ఏమిటి?

జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు నందమూరి తారక రామారావు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ap-weather-heavy-rains-for-the-next-three-days/andhra-pradesh/531503/

Anantapur MLA Daggupati Prasad Breaking News Daggupati Prasad clarification fake audio viral Jr NTR Junior NTR controversy latest news MLA comments on Jr NTR Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.