📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Jigra Collections; ఈసినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 100 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది?

Author Icon By Divya Vani M
Updated: October 30, 2024 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ హిందీ సినీ నిర్మాణ సంస్థలు వాయాకామ్ 18 స్టూడియోస్ ధర్మ ప్రొడక్షన్స్, మరియు ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం జిగ్రా . ఈ సినిమా వాసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కి, బాలీవుడ్ స్టార్ ఆలియా భట్, యువ నటుడు వేదాంగ్ రైనా, అలాగే దక్షిణాది నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకోగా, ఆలియా భట్ తో పాటు కరణ్ జోహర్, అపూర్వ మెహత షాహీన్ భట్ సోమెశ్ మిశ్రా వంటి ప్రముఖులు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు జిగ్రా చిత్రానికి వచ్చిన రెస్పాన్స్, కలెక్షన్ల గురించి పరిశీలిస్తే, భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది ఆలియా భట్ ప్రమోషన్స్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపించి, దేశవ్యాప్తంగా ప్రచారం చేసినా, సినిమా ఆర్థికంగా నిలబడాలంటే కనీసం 100 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ సినిమా నిర్మాణ ఖర్చులు, ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులతో కలిపి 90 కోట్ల రూపాయల వరకు వెచ్చించారని తెలుస్తోంది.

జిగ్రా సినిమా మొదటి రోజు 4.5 కోట్లు, రెండో రోజు 6.5 కోట్లు, మూడవ రోజు 5.5 కోట్లు వసూలు చేసింది తొలివారంలో 16.5 కోట్ల వసూళ్లను సాధించింది. కానీ, ఈ వసూళ్లు మొదటి వారాంతం తరువాత తగ్గుముఖం పట్టాయి. నాలుగవ రోజు 1.75 కోట్లు, 5వ రోజు 1.5 కోట్లు, 6వ రోజు 1.25 కోట్లు, 7వ రోజు 1.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది తరువాతి వారంలో ఈ వసూళ్లు పూర్తిగా క్షీణించాయి రెండవ వారంలో కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది ఓవర్సీస్‌లో కాస్త మెరుగైన స్పందన ఉన్నప్పటికీ, మొత్తం 3 మిలియన్ డాలర్ల వసూళ్లు, అంటే సుమారుగా 25 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది సామగ్రికంగా 30 కోట్ల రూపాయలు మాత్రమే నికర వసూళ్లను సాధించింది ఈ సినిమా మొత్తంగా 60 కోట్ల థియేట్రికల్ వాల్యూ కలెక్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ, వసూళ్లు అర్థాంతరంగా నిలిచిపోవడంతో సినిమా భారీ నష్టాలు చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసినట్టే అని చెప్పవచ్చు.

AliaBhatt bollywood BollywoodActionDrama BoxOfficeCollections DharmaProductions FilmIndustry FilmPromotions HindiCinema Jigra KaranJohar MixedResponse MovieLosses MovieReview RahulRavindran TheatricalRelease VasanBala VedangRaina

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.