📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Jatadhara movie – జటాధర సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Author Icon By Anusha
Updated: September 15, 2025 • 6:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టర్స్ సాధించిన సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌తో ఆగిపోకుండా కొత్త చైతన్యంతో ముందుకు వెళ్తుంటారు. అలాంటి నటుల్లో ఒకరు సుధీర్ బాబు. నైపుణ్యంతో, ప్రేక్షకులను ఆకట్టుకునే నేటివిటీతో కూడిన నటనతో సుధీర్ బాబు తాను ఎంచుకున్న ప్రతి ప్రాజెక్ట్‌లోనూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈ సారి సుధీర్ బాబు ఫ్యాన్స్ కోసం సరికొత్త అనుభూతిని తీసుకువస్తున్నాడు. అతను నటిస్తున్న తాజా సినిమా జటాధర (Jatadhara) ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్.

వెంకట్‌ కల్యాణ్ (Venkat Kalyan) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ సినిమాగా వస్తోంది. కాగా మేకర్స్‌ ఎన్నో రోజులుగా విడుదలపై నెలకొన్న డైలామాకు తెరదించారు. ఈ మూవీని నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ కూడా త్వరలో మొదలు కానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్‌సైడ్‌ టాక్.

Jatadhara movie

సినిమాపై అంచనాలు

ఓ వైపు శివుడు మరోవైపు చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్న సుధీర్‌బాబు (Sudheer Babu), ఇంకోవైపు ఉగ్రరూపంలో కనిపిస్తున్న సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) లుక్స్‌ను మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేయగా.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) కీలక పాత్ర పోషిస్తోంది.

సుధీర్‌ బాబు నటించిన హరోం హర, మా నాన్న సూపర్ హీరో సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయని తెలిసిందే. దీంతో తన ఆశలన్నీ జటాధర సినిమాపైనే పెట్టుకున్నాడు. మరి ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌ సుధీర్‌బాబుకు ఎంతలా కలిసొస్తుందో చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dulquer-salmaan-ramya-krishna-to-star-in-dq-41/cinema/547900/

Breaking News jatadhara supernatural thriller latest news sudheer babu new movie sudheer babu upcoming film supernatural thriller movie Telugu cinema 2025 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.