📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Jana Nayagan Movie: రాజకీయాలకు, సెన్సార్‌కు సంబంధం లేదు: పవన్ కళ్యాణ్

Author Icon By Aanusha
Updated: March 17, 2026 • 9:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jana Nayagan Movie: తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్ వివాదంలో చిక్కుకోవడంపై టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ బోర్డు (CBFC) నిర్ణయాల్లో రాజకీయ జోక్యం ఉంటుందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

Read Also: Actress Pratyusha Case: ప్రత్యూష కేసులో కీలక మలుపు: నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి

ఎవరికైనా నిబంధనలు ఒకటే

సెన్సార్ బోర్డు (CBFC) ఒక స్వతంత్ర సంస్థ అని, అది నిబంధనల ప్రకారమే పని చేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయ జోక్యం ఉండదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని ఆయన అన్నారు. ‘జన నాయగన్’ చిత్ర బృందం సెన్సార్ బోర్డుతో సమస్యను సరిగ్గా పరిష్కరించుకోలేకపోయి ఉండవచ్చని, అంతేకానీ దీనికి ఎన్డీయే ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం లేదా నిందించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరికైనా రూల్ ఒకటేనని అన్నారు.

Jana Nayagan Movie: Politics and censorship have nothing to do with it: Pawan Kalyan

ఈ సందర్భంగా తన ‘ఓజీ’ సినిమా విషయంలో ఎదురైన అనుభవాన్ని వివరించారు.”నేను ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి, నా సినిమాకి మా టీమ్ కోరుకున్నట్లు సర్టిఫికేట్ వస్తుందని అందరూ భావించారు. కానీ, సెన్సార్ బోర్డు ‘ఓజీ’కి ‘ఏ’ (A) సర్టిఫికేట్ ఇచ్చింది. నేను దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాను. సినిమాలో హింస ఎక్కువగా ఉన్నప్పుడు ‘యూ/ఏ’ సర్టిఫికేట్ ఎలా ఆశిస్తారని నా టీమ్‌ను ప్రశ్నించాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరికైనా నిబంధనలు ఒకటే అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా పవన్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CBFC Censor Controversy Jana Nayagan Pawan Kalyan vs Vijay TVK party

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.