కోలీవుడ్ సినిమా ప్రపంచంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ప్రత్యేక స్థానం ఉంది.ఇటీవల కాలంలో ఆయన నటించిన “జైలర్” చిత్రం బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. టైటిల్ రోల్‌లో రజినీకాంత్ ప్రభావం, కథలోని థ్రిల్లర్ అంశాలు, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిమానులు, విమర్శకులు కూడా జైలర్ సినిమాకు అధిక ప్రశంసలు కురిపించారు. ఈ విజయవంతమైన చిత్రం తర్వాత, అభిమానులు “జైలర్ 2” కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీకి కొనసాగింపుగా జైలర్ 2 (Jailer 2) వస్తున్న సంగతి తెలిసిందే. జైలర్ 2 షూటింగ్ కోసం ఇటీవలే తలైవా టీం కేరళకు వెళ్లింది. ఈ సందర్భంగా 2026 జూన్ తర్వాతే జైలర్ 2 విడుదల ఉంటుందని హింట్ ఇచ్చి అభిమానులను ఫుల్ ఖుషీ చేశాడు రజినీకాంత్.జైలర్ 2 ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా..?
మీడియాతో చిట్‌చాట్‌లో తలైవా మాట్లాడుతూ
అని ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ అందించాడు సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth). మీడియాతో చిట్‌చాట్‌లో తలైవా మాట్లాడుతూ.. జైలర్ 2ను 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. షూటింగ్ చాలా అద్బుతంగా కొనసాగుతోందని అన్నాడు. తాజా టాక్ ప్రకారం డిసెంబర్ లేదా జనవరి కల్లా జైలర్ 2 (Jailer 2) ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కానున్నాయి. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి.
జైలర్ ఫస్ట్ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. సీక్వెల్‌లో శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ పాత్రలు రిపీట్ కానుండగా.. మిగిలిన పాత్రల్లో ఎవరెవరు మళ్లీ కనిపించబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. సీక్వెల్‌ను కూడా ఫస్ట్ పార్టును తెరకెక్కించిన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: