ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా ప్రయోగించిన అత్యంత భారీ రాకెట్ ‘ఎల్‌వీఎం3-ఎం5’ కు ‘బాహుబలి’ అనే పేరు ఇవ్వడంపై దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) ఆనందం వ్యక్తం చేశారు. ఈ పేరు తమ సినిమా బృందానికి దక్కిన గొప్ప గౌరవమని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రాజమౌళి పోస్ట్ చేస్తూ, ఇస్రో శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇస్రో తాజాగా చేసిన ప్రయోగంలో సీఎంఎస్–03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. భారీ బరువు, అధిక శక్తి సామర్థ్యం కారణంగా ఆ వాహక నౌకకు శాస్త్రవేత్తలు స్నేహపూర్వకంగా ‘బాహుబలి’ అనే పేరు పెట్టారు.
News Telugu: ISRO: ఇస్రో ‘ఎల్‌వీఎం3-ఎం5’ రాకెట్‌కు ‘బాహుబలి’ అని పేరు: రాజమౌళి
Read also: Rashmika Mandanna : ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన రష్మిక
ISRO: ఈ విషయంపై రాజమౌళి స్పందిస్తూ, “భారత సాంకేతిక ప్రతిభను ప్రతిబింబించే ఇలాంటి క్షణాలు మన అందరికీ గర్వకారణం. రాకెట్‌కు ‘బాహుబలి’ అని పేరు పెట్టడం మా చిత్ర బృందానికి గౌరవంగా భావిస్తున్నాం. ఇస్రో విజయానికి దేశం మొత్తం గర్వపడుతోంది” అని పేర్కొన్నారు. రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులు మరియు నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: