Iran Israel War: దుబాయ్‌లో చిక్కుకున్న సినీ ప్రముఖులు

Read Time:  1 min
Iran Israel War: దుబాయ్‌లో చిక్కుకున్న సినీ ప్రముఖులు
FONT SIZE
GET APP

Iran Israel War: మధ్యప్రాచ్యంలో ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ కుమార్, మాధవన్ దుబాయ్‌లో చిక్కుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.. దీంతో వారి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అజిత్ కుమార్ క్షేమం: టీమ్ అధికారిక ప్రకటన

హీరో అజిత్ గురించి వస్తున్న వార్తలపై ఆయన పీఆర్ టీమ్ స్పందించింది. అజిత్ క్షేమంగా ఉన్నారని వారు ధృవీకరించారు. మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన అజిత్, నిన్ననే తిరిగి రావాల్సి ఉంది. అయితే విమానాల రద్దు కారణంగా కొంత ఆలస్యమైనా, ఆయన సురక్షితంగా ఉన్నారని తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: Suriya 45 Update: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టైటిల్ అనౌన్స్మెంట్

Iran Israel War: Film celebrities trapped in Dubai
Iran Israel War: Film celebrities trapped in Dubai

నేను అమెరికాలో ఉన్నాను: క్లారిటీ ఇచ్చిన మాధవన్

మరోవైపు నటుడు మాధవన్ కూడా తన గురించి వస్తున్న రూమర్లపై స్పందించారు. తాను ప్రస్తుతం దుబాయ్‌లో లేనని, తన కుటుంబంతో కలిసి అమెరికా (US) పర్యటనలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో మాధవన్ దుబాయ్‌లో చిక్కుకున్నారనే వార్తలకు తెరపడింది.మంచు విష్ణు, సోనాల్ చౌహాన్, PV సింధు తదితరులు దుబాయ్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.