📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

International Women’s Day 2026: గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

Author Icon By Anusha
Updated: March 6, 2026 • 3:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

International Women’s Day 2026: మహిళలు క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఉమెన్స్ క్రికెట్ లీగ్ (WCL) ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, లా వీ ఎన్ రోజ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో లీగ్ అధికారిక లోగోను ప్రముఖ సినీ ప్రముఖులు, అతిథులు కలిసి ఆవిష్కరించారు. ఈ వేదిక మహిళా క్రీడాకారిణుల కలలకు సరికొత్త రూపాన్ని ఇవ్వబోతోంది.

Read Also: Janhvi Kapoor: పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్

ముఖ్య అతిథులుగా టాలీవుడ్ ప్రముఖులు

ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వ ప్రసాద్, నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్, లీగ్ డైరెక్టర్, నటి స్నిగ్ధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, కమ్యూనిటీ కనెక్ట్ స్పోర్ట్స్ డైరెక్టర్ సందీప్ వర్మ ప్రత్యేక అతిథులుగా పాల్గొని కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు.

International Women’s Day 2026: Women’s Cricket League logo unveiled in Gachibowli

కుటుంబం, ఉద్యోగం, వ్యక్తిగత లక్ష్యాలను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్న మహిళల సంకల్పం, శక్తి, ఐక్యతను గుర్తించి ప్రోత్సహించడం ఈ లీగ్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు స్నిగ్ధ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

మహిళా సాధికారతకు క్రీడా బాట

ఈ లోగో ఆవిష్కరణతో ఉమెన్స్ క్రికెట్ లీగ్ ప్రయాణానికి నాంది పలికినట్టైంది. మహిళలకు క్రికెట్ రంగంలో మరిన్ని అవకాశాలు కల్పించి బలమైన క్రీడా వేదికను నిర్మించాలనే దృక్పథాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.ఉమెన్స్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు మార్చి 7 , మార్చి 8, 2026 తేదీలలో సాయంత్రం 6:00 గంటలకు తెల్లాపూర్‌లోని ప్రైమ్ అరినా లో నిర్వహించబడనున్నాయి. ఈ లీగ్‌లో సినీ రంగం, కార్పొరేట్ రంగం, గృహిణులు, ఇతర సమాజాల నుంచి వచ్చిన 6 ఫ్రాంచైజీలకు చెందిన మొత్తం 96 మంది మహిళలు పాల్గొననున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

International Women’s Day 2026 Snigdha WCL Director TG Vishwa Prasad People Media Factory WCL Logo Launch Womens Cricket League Hyderabad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.