📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Indian Actors: అత్యంత సంపన్న నటుల జాబితా విడుదల

Author Icon By Anusha
Updated: January 25, 2026 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత సినీ పరిశ్రమ లో అత్యంత సంపన్న నటుల జాబితా (Indian Actors) తాజాగా వెలువడింది. ఈ జాబితా సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ లిస్టులో బాలీవుడ్ ఖాన్ల హవా కొనసాగుతుండగా.. మన టాలీవుడ్ నుండి ఏకంగా నలుగురు హీరోలు టాప్-10లో నిలిచి సత్తా చాటారు.  

Read Also: Actor: మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న హీరో నారా రోహిత్

1. షారుఖ్ ఖాన్ – రూ.12,931 కోట్లు

ఈ జాబితాలో కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ ద్వారా భారీగా సంపాదిస్తూ, కిడ్జానియా వంటి అంతర్జాతీయ బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టారు.

2. నాగార్జున – రూ.5,000 కోట్లు

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున రెండో స్థానంలో ఉండి అందరినీ ఆశ్చర్యపరిచారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎన్-కన్వెన్షన్ వంటి సంస్థలతో పాటు హోటళ్లు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆయనకు పెట్టుబడులు ఉన్నట్టు వార్తలు ఉన్నాయి. అవే నాగార్జునను అత్యంత సంపన్న సౌత్ ఇండియన్ హీరోగా నిలబెట్టాయి.

3. సల్మాన్ ఖాన్ – రూ.3,225 కోట్లు

సల్మాన్ ఖాన్ తన సొంత ప్రొడక్షన్ హౌస్‌తో పాటు ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ ద్వారా భారీ లాభాలు అందుకుంటున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ వంటి షోల హోస్టింగ్‌కు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ చింగారి వంటి స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారట.

4. హృతిక్ రోషన్ – రూ.3,100 కోట్లు

బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ తన ఫిట్‌నెస్ బ్రాండ్ HRX ద్వారా వేల కోట్లు గడిస్తున్నారని వార్తలు ఉన్నాయి. క్యూర్.ఫిట్ వంటి స్టార్టప్‌లలో ప్రధాన వాటాదారుగా ఉంటూ తన సంపదను పెంచుకుంటున్నారు.

Indian Actors: List of richest actors released

5. అక్షయ్ కుమార్ – రూ.2,250 కోట్లు

ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ వందల కోట్లు సంపాదిస్తున్న అక్షయ్ కుమార్‌కు విదేశాల్లో, ముఖ్యంగా కెనడాలో భారీగా ఆస్తులు ఉన్నాయట. సుమారు 40 బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు.

6. అమీర్ ఖాన్ – రూ.1,860 కోట్లు

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తక్కువ సినిమాలు చేసినా, తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తూ లాభాల్లో వాటాలు తీసుకుంటారు. డ్రోన్ ఆచార్య వంటి టెక్నాలజీ స్టార్టప్‌లలో ఆయనకు పెట్టుబడులు ఉన్నట్టు సమాచారం.

7. చిరంజీవి – రూ.1,750 కోట్లు

మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్, బెంగుళూరులో ఖరీదైన ఆస్తులు ఉన్నాయని వార్తలు ఉన్నాయి. ఆయనకు పలు వ్యాపారాల్లో భాగస్వామ్యంతో పాటు సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది.

8. అమితాబ్ బచ్చన్ – రూ.1,680 కోట్లు

బిగ్ బి అమితాబ్ సినిమాలు, కేబీసీ షో ద్వారా నేటికీ భారీగా సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్, టెక్ స్టార్టప్‌లలో ఆయన పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తున్నాయట.

9. వెంకటేష్ – రూ.1,650 కోట్లు

విక్టరీ వెంకటేష్ కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 400 పైగా థియేటర్ల నెట్‌వర్క్ ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా స్టూడియోలు, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో వీరు తిరుగులేని సంపదను కలిగి ఉన్నారని తెలుస్తోంది.

10. రామ్ చరణ్ – రూ.1,630 కోట్లు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి బాటలోనే వ్యాపారాల్లో రాణిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు ట్రూ జెట్ ఏవియేషన్ సంస్థలో ఆయనకు వాటాలు ఉన్నాయి. అపోలో హెల్త్ సిటీ కుటుంబంతో ఉన్న బంధుత్వం కూడా ఆయన వ్యాపారాలకు తోడ్పడుతోందని అంచనా

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bollywood actors latest news nagarjuna Richest actors in India Shah Rukh Khan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.