📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Imanvi: ప్రభాస్ హీరోయిన్ లేటెస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్

Author Icon By Anusha
Updated: October 27, 2025 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘రెబల్ స్టార్’ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో సాలార్ 2, కల్కి 2898 AD సీక్వెల్, ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి సినిమాలు ఉన్నాయి. వాటిలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ (Fauji)’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇమాన్వి (Imanvi) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: Darshan Lawyer: ఉరిశిక్ష వేసినా పర్వాలేదు.. త్వరగా విచారణ పూర్తి చేయండి

తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఇమాన్వి(Imanvi) .. క్లాసికల్, మోడ్రన్ స్టెప్పులను కలిపి చేసిన డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించిన ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కామెంట్స్ సెక్షన్‌లో ‘ప్రభాస్ జోడీకి పర్ఫెక్ట్ ఛాయిస్’ అని, ‘నెక్స్ట్ సీతారామం గర్ల్’ అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

‘సీతా రామం’ వంటి బ్లాక్‌బస్టర్‌తో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించిన దర్శకుడు హను రాఘవపూడి, ఈసారి ప్రభాస్‌తో కలిసి భారీ స్కేల్‌లో ‘ఫౌజీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘సీతా రామం’ ద్వారా మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) ని తెలుగు తెరకు పరిచయం చేసిన హను, ఈసారి హీరోయిన్‌గా ఇమాన్విని ఎంపిక చేశారు.

View this post on Instagram

A post shared by Imanvi (@imanvi1013)

స్టార్ హీరో సరసన ఈ కొత్త టాలెంట్ ఎలా ఆకట్టుకుంటుందో

సినిమా మొదలు కాకముందే ఈ భామ పేరు చర్చలోకి రావడానికి కారణం ఆమె అద్భుతమైన డ్యాన్సింగ్ స్కిల్స్. ‘ఫౌజీ’ ఆఫర్ రావడానికి ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయిన డ్యాన్స్ వీడియో కూడా కీలక పాత్ర పోషించిందని ఫిల్మ్‌నగర్ టాక్.

సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ఇమాన్వి తన డ్యాన్స్ ట్యాలెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్ వంటి స్టార్ హీరో సరసన ఈ కొత్త టాలెంట్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ప్రభాస్-ఇమాన్వి జోడీ వెండితెరపై సృష్టించబోయే మ్యాజిక్‌పైనే నెలకొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Imanvi Dance Video latest news Prabhas Fauji Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.