📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Ibomma Ravi: హీరోల పై ఐబొమ్మ రవి తండ్రి తీవ్ర వ్యాఖ్యలు

Author Icon By Sushmitha
Updated: November 24, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమను, ప్రేక్షకులను ఓ ఊపు ఊపుతున్న పేరు ‘ఐబొమ్మ’.(Ibomma Ravi) ఈ వెబ్‌సైట్ సృష్టికర్త రవి తండ్రి అప్పారావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో (Interview) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కొడుకు చర్యలను చట్టపరంగా తప్పుబడుతూనే, అతని వెనుక ఉన్న ఆకలి కేకలను, సినీ పరిశ్రమలోని లోపాలను, తన కుటుంబంలోని కలహాలను భావోద్వేగంతో బయటపెట్టారు.

Read Also: Flight Rules: ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్! ఈ 10 వస్తువులు నిషేధం

సినీ నిర్మాత సి. కళ్యాణ్‌పై తీవ్ర ఆగ్రహం

సినీ నిర్మాత సి. కళ్యాణ్ తన కొడుకును ఉద్దేశించి “వాడిని కాల్చేయండి” అన్నారని ఆరోపిస్తూ అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా కొడుకుని కాల్చమంటున్నారు, ఆ నొప్పి ఏంటో తెలియట్లేదు. అదే ఆయన కొడుకుని కాలిస్తే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. వందల, వేల కోట్లు మింగేయడానికి నా కొడుకు అడ్డు వచ్చాడనే వాళ్లకు అంత కోపం. నా కొడుకును అన్నాడు కాబట్టే నేను కళ్యాణ్‌ను అంటున్నాను, అంతేకానీ ఆయనపై నాకు వ్యక్తిగత పగ లేదు” అంటూ ఓ తండ్రిగా తన ఆవేదనను వెళ్లగక్కారు.

Ibomma Ravi: Ibomma Ravi’s father’s harsh comments on heroes

ఆకలి నుంచే ఐబొమ్మ పుట్టింది

తన కొడుకు రవి ఈ స్థాయికి రావడానికి, ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఆకలి, పేదరికమేనని అప్పారావు కన్నీటిపర్యంతమయ్యారు. “వాడు ఆకలిలోంచి పుట్టాడు. ఇంట్లో సమస్యల వల్ల నేను, నా భార్య విడిపోయాం. వాడు ఒంటరివాడయ్యాడు. ఇంట్లో అన్నం లేక పస్తులున్నాడు. ఆ పట్టుదల పస్తుల్లోంచే వచ్చింది” అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు చేసింది తప్పే అయినా, ఈ రోజు కోట్లాది మంది సామాన్యులు అతనికి మద్దతుగా నిలవడం చూస్తున్నామని, కానీ ఆ పేరు, ప్రఖ్యాతులు తనకు వద్దని, తన కొడుకు ఇంట్లో ఉంటే చాలని అన్నారు.

సినీ పరిశ్రమపై ప్రశ్నల వర్షం

సినిమా పరిశ్రమలోని (film industry) పోకడలను అప్పారావు (Apparao) తీవ్రంగా విమర్శించారు. హీరోలకు వందల కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. “ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారి దేశం కోసం రాత్రింబవళ్లు కష్టపడితే లక్షల్లో జీతం వస్తుంది. కానీ వీళ్లు కట్ కట్ అంటూ కాస్త నటిస్తే వందల కోట్లు ఎలా ఇస్తారు? ఇది నిర్మాతల బుద్ధిలేని పని. తక్కువ రెమ్యూనరేషన్‌తో నటించే సుమన్, రాజశేఖర్ లాంటి వాళ్లకు అవకాశాలు ఎందుకు ఇవ్వరు? కొత్త వాళ్లను ఎందుకు ప్రోత్సహించరు?” అని ప్రశ్నించారు. పరిశ్రమలో నెపోటిజం ఉందని, వారసత్వం ఉన్నవాళ్లకే అవకాశాలు దక్కుతున్నాయని ఆరోపించారు.

థియేటర్లలో తినుబండారాల ధరలు ఆకాశాన్ని అంటడంపై కూడా ఆయన మండిపడ్డారు. “ఒక పేదవాడు కుటుంబాన్ని సినిమాకు తీసుకెళితే రూ.1000 ఖర్చవుతుంది. ఈ బాధ లేకుండా నా కొడుకు ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడని పేదవాడు సంతోషిస్తున్నాడు. నష్టం వస్తుందని డబ్బున్నోడు, నిర్మాతలు ఏడుస్తున్నారు. వాళ్లు బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికే సినిమాలు తీస్తున్నారు” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

కుటుంబ కలహాలు, భార్యపై ఆరోపణలు

తన వ్యక్తిగత, కుటుంబ జీవితంలోని చేదు అనుభవాలను కూడా అప్పారావు పంచుకున్నారు. తన భార్యది ‘క్రిమినల్ బ్రెయిన్’ అని, కొడుక్కి కూడా అవే జీన్స్ వచ్చాయని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. “నా భార్య నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఆమె ఆలోచనా విధానం వేరు. పిల్లల్ని తప్పుడు మార్గంలో ప్రోత్సహిస్తే ఇలాగే తయారవుతారు. ఆ బాధలు పడలేకే నేను విడిగా వచ్చేశాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను” అని తెలిపారు. తన కొడుకు వందల కోట్లు సంపాదించాడని అంటున్నారని, కానీ తనకు ఆ డబ్బు అక్కర్లేదని, వాడు పంపలేదని స్పష్టం చేశారు. తనకు వచ్చే పెన్షన్‌తోనే సంతోషంగా జీవిస్తున్నానని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Appa Rao interview C. Kalyan controversy Google News in Telugu Ibomma Ravi Latest News in Telugu piracy issues Telugu Film Industry Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.