తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కలకలం రేపిన ఐబొమ్మ(IBOMMA RAVI) కేసు దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ వ్యవహారంలోకి తాజాగా తెలంగాణ సీఐడీ కూడా ప్రవేశించింది. ఐబొమ్మ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్(Betting app)ల ప్రమోషన్ చేసిన అంశాన్ని సీఐడీ ప్రధానంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇలాంటి బెట్టింగ్ కేసులను చూసుకుంటున్న సీఐడీ, రవికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగాన్ని కోరింది.
Read Also: I Bomma: ఐబొమ్మ రవి అరెస్టు.. సజ్జనార్ పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
సైబర్ క్రైమ్ పోలీసులు రవిని మూడో రోజు
ఇక సైబర్ క్రైమ్ పోలీసులు రవిని మూడో రోజు కస్టడీలో విచారిస్తున్నారు. ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది. నిన్న దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ప్రశ్నల్లో అధికారులు కీలక వివరాలను పొందినట్లు సమాచారం. ఐబొమ్మకు కొత్త సినిమాలు ఎలా చేరుతున్నాయి? వాటిని అందిస్తున్న వ్యక్తులు ఎవరు? బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులతో రవికి ఉన్న అనుబంధం ఏమిటి? వంటి అంశాలపై పోలీసులు లోతైన విచారణ నిర్వహిస్తున్నారు.
సైబర్ క్రైమ్ విచారణ కొనసాగుతున్న సమయంలో సీఐడీ కూడా రంగంలోకి దిగడంతో మొత్తం కేసు మరింత విస్తరించే అవకాశం కనిపిస్తోంది. రెండు దర్యాప్తు సంస్థలు ఒకేసారి పని చేయడంతో రవికి సహాయపడ్డ వారి మీద ఉచ్చు మరింతగా బిగుస్తున్నట్లు తెలుస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: