📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: iBomma: ‘ఐబొమ్మ వన్’ పేరుతో మరో పైరసీ వెబ్‌సైట్

Author Icon By Anusha
Updated: November 20, 2025 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా తెలిసిన పైరసీ వెబ్‌సైట్ iBomma‌ను పోలీసులు మూసివేసి కొన్ని రోజులు కూడా పూర్తికాకముందే, అదే తరహాలో మరో కొత్త వెబ్‌సైట్ వెలుగులోకి వచ్చింది. ‘iBomma One’ అనే పేరుతో బయటకు వచ్చిన ఈ కొత్త సైట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. పైరసీ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న సమయంలో ఈ సైట్ ఆకస్మికంగా రీ-ఎంట్రీ ఇచ్చినట్టు కనిపించడం విస్తృత చర్చకు దారితీసింది.

Read Also: Suriya new movie : ‘సూర్య 47’: సూర్య–జితు మాధవన్ సినిమా డిసెంబర్ 8 నుండి కేరళలో..

పాత సైట్ మూసివేత – రవి అరెస్ట్‌తో ముగిసినట్టు అనిపించిన కేసు

ఐబొమ్మ (iBomma‌) నిర్వాహకుడు రవి అరెస్ట్ తర్వాత ఈ వ్యవహారం ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కొత్తగా ప్రారంభమైన ‘ఐబొమ్మ వన్’ వెబ్‌సైట్ చూడటానికి అచ్చం పాత ఐబొమ్మ లాగే ఉంది. అయితే, పాత సైట్‌లో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే ఉండగా, కొత్త సైట్‌లో ఇతర భాషా చిత్రాలు కూడా అందుబాటులో ఉంచారు.

iBomma: Another piracy website named ‘iBomma One’

దీని వెనుక రవి అనుచరులు ఉన్నారా? లేక మరెవరైనా ఉన్నారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ కొత్త వెబ్‌సైట్‌లో ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే, అది నేరుగా ‘మూవీ రూల్జ్’ అనే మరో పైరసీ సైట్‌కు రీడైరెక్ట్ అవుతున్నట్టు గుర్తించారు.ఐబొమ్మ ఎకోసిస్టమ్‌లో సుమారు 65 మిర్రర్ వెబ్‌సైట్లు ఉన్నాయని, వాటి ద్వారానే ‘ఐబొమ్మ వన్’ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

అవే ఫీచర్లు

ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీ వంటి సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.కాగా, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడు తరచూ విదేశాలకు వెళ్లేవాడని.. ఎవరినీ నమ్మకపోవడంతో ఇంట్లో పనివాళ్లను కూడా పెట్టుకోలేదని పోలీసులు గుర్తించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

ibomma new site ibomma one latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.