📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Samantha: సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది: రాజ్ పిన్ని

Author Icon By Anusha
Updated: December 8, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సమంత, రాజ్‌ నిడిమోరుల వివాహం ఇటీవలే ఘనంగా జరిగింది. వీరి పెళ్లి ఈషా ఆశ్రమంలో చాలా సింపుల్ గా అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఆ సన్నిహితులతో రాజ్ తల్లి రమాదేవి సోదరి, పద్మశ్రీ అన్నమయ్య పదకోకిల డా. శోభారాజు (Dr. Shobha Raju) హాజరయ్యింది. ఇక మొదటిసారి రాజ్ – సమంత పెళ్లి తరువాత శోభారాజు పలు విషయాలు వెల్లడించారు. సామ్‌ (Samantha) తో ఉన్న మునుపటి అనుబంధాన్ని, రాజ్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Read Also: Sairat Movie: ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేసిన ‘సైరాట్’ సక్సెస్ స్టోరీ

ఒకే రకమైన క్రమశిక్షణ పాటించడం మంచి విషయం

“రాజ్ మా అక్క కుమారుడు. చిన్నప్పుడే డివోషనల్ పాటలు పాడేవాడు. అతనిపై నాకు అపారమైన ప్రేమ,” అని చెప్పిన శోభారాజు, సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. “ఆహారం విషయంలో సామ్ చాలా క్రమశిక్షణతో ఉంటుంది. మూడు నెలలకోసారి ఈశా యోగా కేంద్రానికి వెళ్లి ధ్యానం చేస్తుందని విన్నాను… తర్వాత నిజమే అని తెలిసింది.

I would be embarrassed to sit next to Samantha: Raj’s aunt

ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది. ఆమె ఇచ్చే డైట్ సలహాలు పాటించాలంటే భయమేసేది,” అని చిరునవ్వుతో గుర్తుచేసుకున్నారు. సామ్ ఆధ్యాత్మికత, ధ్యానం, ఫిట్‌నెస్‌ పట్ల ఉన్న నిబద్ధత రాజ్‌కు కూడా ఉందని, ఇద్దరూ ఆహారం, వ్యాయామం, మెడిటేషన్ విషయంలో ఒకే రకమైన క్రమశిక్షణ పాటించడం మంచి విషయం అని తెలిపారు.

శోభారాజు ఎవరు?

శోభారాజు ప్రముఖ గాయకురాలు. ముఖ్యంగా డివోషనల్ పాటలు, జానపద పాటలు పాడారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

devotional songs disciplined lifestyle latest news Raj Samantha Shobharaju Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.