VV Vinayak Political Entry: పాలిటిక్స్‌ లోకి రానని చెప్పను.. అలా అని ఇంట్రెస్ట్ లేదని అనను: వీవీ వినాయక్

Read Time:  1 min
VV Vinayak Political Entry: పాలిటిక్స్‌ లోకి రానని చెప్పను.. అలా అని ఇంట్రెస్ట్ లేదని అనను: వీవీ వినాయక్
FONT SIZE
GET APP

VV Vinayak Political Entry: ‘ఆది’, ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా వినాయక్ గుర్తింపు పొందారు. అయితే, ఆయన కేవలం సినిమాలకే పరిమితం కాకుండా అసెంబ్లీలో అడుగుపెడతారనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి.ఇప్పుడు లేటెస్టుగా తన పొలిటికల్ ఎంట్రీపై వినాయక్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Also: Vijay Sethupathi-Sai Pallavi: కొత్త మూవీని ప్రకటించిన మణిరత్నం

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వీవీ వినాయక్ తెరకెక్కించిన ఆది సినిమా వచ్చి 25 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత నల్లమలపు బుజ్జితో కలిసి వినాయక్ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో రాజకీయ రంగ ప్రవేశం గురించి వినాయక్ మాట్లాడుతూ.. మా ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం ఉంది. గ్రామస్థాయిలో మా నాన్నగారు సర్పంచ్ గా చేశారు.

I won't say I won't enter politics.. I won't say I'm not interested: VV Vinayak
I won’t say I won’t enter politics.. I won’t say I’m not interested: VV Vinayak

VV Vinayak Political Entry: డెస్టినీ ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడే మాట్లాడలేం

అప్పటికి ఆంధ్రప్రదేశ్ లోనే ఆయనది హయ్యెస్ట్ మెజారిటీ. ఆ తర్వాత మా తమ్ముడికి నాన్న కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. మా తాతగారి వాళ్ల అమ్మాయి మూడుసార్లు సర్పంచ్ గా ఎన్నికైంది””మా తమ్ముడు వైసీపీ పార్టీలో ఉన్నాడు. మా నాన్నగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫాలోవర్. మా అమ్మానాన్నలు చనిపోయినప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చారు. ఇలా మాది రాజకీయ వాసనలు ఉన్న కుటుంబమే. దాన్ని నేను కాదనలేను. డెస్టినీ ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడే మాట్లాడలేం. నేను రాజకీయాల్లోకి రానని చెప్పను.. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పను.. అలా అని రాజకీయాలు తప్ప ఇంకేమీ లేదు, అది లేకుండా ఉండలేను అని కూడా చెప్పను”“నాకు తెలిసినంత వరకూ..

ఇప్పటిదాకా నేను అందరికీ మంచి చేశాను.. రూపాయి సాయం చేశానే తప్ప, ఎవరికీ చెడు చేసింది లేదు. ఉపకారం తప్ప, అపకారం ఎవరికీ చెయ్యలేదు.. చెయ్యను కూడా” అని వివి వినాయక్ అన్నారు. దీన్ని బట్టి ఆయన భవిష్యత్ లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. తన ఫ్యామిలీ ఇప్పటికే వైసీపీలో ఉంది కాబట్టి, ఆ పార్టీలో చేరొచ్చని అభిప్రాయపడుతున్నారు. వినాయక్.. గోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఆయన ఫ్యామిలీకి మంచి పేరు ఉండటంతో , ఒకవేళ వైసీపీలో చేరితే ఆ ప్రాంతంలో ప్రభావం చూపే అవకాశముంది. చూద్దాం.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.