📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Allu Arjun: బన్నీ వల్లే డ్యాన్స్ క్వీన్ అయ్యా: స్టార్ హీరోయిన్

Author Icon By Anusha
Updated: September 26, 2025 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీనేజ్ వయసులోనే హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (tamannaah Bhatia) ఇప్పుడు ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అగ్ర హీరోలతో పాటు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పరుచుకుంది. అయితే ఈ మధ్యకాలంలో తమన్నా తీసుకున్న కొత్త మలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఐటెమ్ సాంగ్స్‌కి సంబంధించి మేకర్స్ మొదట గుర్తుకు తెచ్చుకునే పేరు ఇప్పుడు తమన్నానే అయింది.

OTT: ఓటీటీలోకి శివ‌కార్తికేయ‌న్ సినిమా.. ఎప్పుడంటే?

35 ఏళ్లు దాటినా కూడా తమన్నా గ్లామర్, ఎనర్జీతో ఇప్పటికీ కుర్రకారుని కట్టిపడేస్తుంది. పాలమీగడలాగా కనిపించే అందం, అద్భుతమైన స్టెప్పులు, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్ఈ కారణంగానే టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఆమెకు డిమాండ్ పెరిగిపోతోంది.అసలు తమన్నా డ్యాన్స్, క్రేజ్ చూసి తోటి హీరోయిన్లు సైతం అసూయ పడుతుంటారు.

కెరీర్లో తొలినాళ్లలో పెద్దగా డ్యాన్స్ మీద కాన్సట్రేట్ చేయని తమన్నా.. ఇప్పుడు అదిరే స్టెప్పులతో దుమ్మురేపుతోంది. అసలు డ్యాన్స్ (Dance) మీద ఆమెకు అంతలా పట్టు ఎలా దొరికింది, అందుకు ఇన్‌స్పిరేషన్ ఎవరు అన్నది ప్రేక్షకులకి ఎప్పుడూ ఆసక్తికరమే. అందుకు కారణం ఎవరో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తమన్నా.

Allu Arjun

నేను చాలా కష్టపడి ఆ స్టెప్పులు

‘నా కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ, ప్రతి సినిమాలోనూ కనీసం నాలుగు, ఐదు పాటల్లో డ్యాన్స్ చేసేదాన్ని. కానీ ‘బద్రీనాథ్‌’ చిత్రంలో నటిస్తున్నప్పుడు అల్లు అర్జున్ నన్ను కొత్త రీతిలో చూసేలా చేశాడు. చాలా క్లిష్టమైన స్టెప్పుల్ని ప్రయత్నించమని ప్రోత్సహించాడు. ఫ్లోర్ మీద చేసే మూమెంట్స్‌ని నేనూ తప్పనిసరిగా చేయాలని సలహా ఇచ్చాడు.

అంతేకాదు, దర్శకుడికి కూడా నేను బాగా డ్యాన్స్ చేస్తానని, దానికి తగ్గట్టే కఠినమైన స్టెప్పులు ఇవ్వాలని చెప్పాడు. దాంతో నేను చాలా కష్టపడి ఆ స్టెప్పులు సాధన చేసి మంచి పేరును తెచ్చుకున్నా’ అని గుర్తు చేసుకుంది. ‘బద్రీనాథ్’ సినిమా (‘Badrinath’ movie) తర్వాత తనకు భారీగా అవకాశాలు వచ్చాయని, ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ తనకు ప్రత్యేకమైన ఇమేజ్‌ తెచ్చిపెట్టాయని, అందరూ తనను డాన్సింగ్ క్వీన్ అని పిలవడం మొదలుపెట్టారని తెలిపింది.

ఆయన స్థాయికి చేరుకోవడం అసాధ్యమే

‘అల్లు అర్జున్ (Allu Arjun) డ్యాన్స్‌లో ఒక ఇన్‌స్పిరేషన్. ఆయన ఇచ్చిన సలహాని పాటించడం వల్లే ఇప్పటికీ నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. కృషి, పట్టుదలే ఆయన్ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. ఆయన స్థాయికి చేరుకోవడం అసాధ్యమే అయినా.. ఆయన్నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ నాకు ఎంతో ఉపయోగపడింది’ అని తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

bollywood Breaking News dance craze inspiration revealed item songs latest news Milky Beauty Tamannaah Bhatia Telugu News tollywood top heroines envy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.