📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Vijay Deverakonda: నేను క్షేమంగా ఉన్నా: విజయ్ దేవరకొండ

Author Icon By Aanusha
Updated: October 6, 2025 • 10:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రౌడీ బాయ్ (Vijay Deverakonda) స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తన కారు చిన్న ప్రమాదానికి గురైనప్పటికీ, తాను, తనతో ప్రయాణిస్తున్న సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే అభిమానులు ఆందోళన చెందగా, విజయ్ ప్రత్యేకంగా వారికి ధైర్యం చెప్పే సందేశాన్ని ఇచ్చారు.

Kalki 2898 AD: దీపికా ఔట్ – సాయి పల్లవి ఇన్

ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన ప్రత్యేకంగా కోరారు.సోమవారం ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. “నాకేం కాలేదు… అంతా బాగానే ఉంది. మా కారుకు దెబ్బ తగిలింది, కానీ మేమంతా క్షేమంగా ఉన్నాం. ఇంటికి తిరిగొచ్చే ముందు జిమ్‌ (GYM) లో స్ట్రెంగ్త్ వర్కౌట్ కూడా పూర్తిచేశాను.

Vijay Deverakonda

విజయ్ దేవరకొండ స్వయంగా ఈ విషయంపై స్పష్టత

కాస్త తలనొప్పిగా ఉంది, కానీ దానికి ఒక మంచి బిర్యానీ, కాస్త నిద్ర సరిపోతుంది. ఎవరూ కంగారు పడకండి” అంటూ తనదైన శైలిలో అభిమానులకు భరోసా ఇచ్చారు.ఎలాంటి వదంతులు వ్యాపించకుండా ఉండేందుకే విజయ్ దేవరకొండ స్వయంగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ పోస్ట్‌తో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.పుట్టపర్తి నుంచి తిరిగొస్తుండగా, జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి వద్ద విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో విజయ్ దేవరకొండ కారుకు స్వల్ప డ్యామేజి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం తర్వాత ఆయన మరో వాహనంలో హైదరాబాద్ చేరుకున్నారు. దీనిపై విజయ్ దేవరకొండ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఉండవల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Telugu News Vijay Deverakonda accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.