తాజాగా ఓ సినిమా మాత్రం ఏకంగా 37 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతుండటం సినీ వర్గాల్లోనే కాదు, ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ దిగ్గజ నటుడు శత్రుఘ్న సిన్హా హీరోలుగా నటించిన హిందీ చిత్రం ‘హమ్ మే షా హెన్ షా కౌన్’ (Hum Mein Shehenshah Kaun).1989లో తెరకెక్కిన ఈ చిత్రానికి దివంగత హర్మేష్ మల్హోత్రా దర్శకత్వం వహించగా, రాజా రాయ్ నిర్మాతగా వ్యవహరించారు.
Read Also: Raakasa Movie: సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్ విడుదల
అప్పట్లోనే ఈ సినిమా (Hum Mein Shehenshah Kaun) షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హేమమాలిని కీలక పాత్రలో నటించడంతో పాటు, అనితా రాజ్, ప్రేమ్ చోప్రా, శరత్ సక్సేనా, దివంగత నటులు అమ్రిష్ పురి, జగదీప్ వంటి బలమైన నటీనటుల సమాహారం ఈ సినిమాకు మరింత బలం చేకూర్చింది. తమిళంలో డబ్బింగ్ చేసి విడుదల చేయాలన్న ఆలోచన కూడా అప్పట్లో మేకర్స్ చేసినట్లు సమాచారం.
2026 ఏప్రిల్‌లో విడుదల
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రీల్ ఫార్మాట్‌లో ఉన్న సినిమాను ఇప్పటికే డిజిటల్ ఫార్మాట్‌గా మార్చారని తెలుస్తోంది. అంతేకాదు, సౌండ్ క్వాలిటీ, విజువల్స్ మెరుగుపరచడంతో పాటు, హీరోల పాత్రలను మరింత ఆకర్షణీయంగా చూపించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువచ్చే బాధ్యతను గతంలో అసోసియేట్ ప్రొడ్యూసర్లుగా పనిచేసిన షబానా, అస్లాం మీర్జా తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ కేటాయించి సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరోవైపు రజనీకాంత్, శత్రుఘ్న సిన్హా, హేమా మాలిని నుంచి అవసరమైన అనుమతులు, అలాగే మ్యూజిక్ కాపీరైట్‌కు సంబంధించిన అంశాలపై కూడా లీగల్ చర్చలు జరుగుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 37 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా చివరకు 2026 ఏప్రిల్‌లో విడుదల అవుతుందని నిర్మాతలు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: