నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju Movie) ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే డీసెంట్ హిట్ తర్వాత మూడేళ్లకి ఇలా ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాడు నవీన్. ట్రైలర్, సాంగ్స్‌తోనే ఇది పక్కా పండగ ఎంటర్‌టైనర్ అనే క్లారిటీ మూవీ టీమ్ ఇచ్చింది. మరి ఆ అంచనాలన్ని థియేటర్లో నవీన్ అందుకున్నాడా? జాతిరత్నాలు లాంటి మరో హిట్ కొట్టాడా? అనేది రివ్యూలో చూద్దాం.
Read Also: Tollywood news: భోగి సందర్భంగా పవన్ కల్యాణ్-టీజీ విశ్వప్రసాద్ భేటీ
కథ
అది గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామం. ఆ గ్రామంలో ఓ జమీందర్ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి ఏకైక వారసుడు రాజు(నవీన్ పొలిశెట్టి). అతని తాత దానధర్మాలు చేసి ఆస్తి అంతా తగలేశాడు. అంతా పోయినా పరువు మాత్రమే మిగిలుంది. ఆ పరువును కాపాడుకుంటూ.. తాను ఇప్పటికీ కోటీశ్వరుడ్నే అన్నట్టు ఊరి జనాలను ఏమారుస్తూ జీవనం సాగిస్తుంటాడు రాజు. అలాంటి రాజుకు ఓ పెళ్లిలో బంధువుల వల్ల అవమానం జరుగుతుంది. దాంతో కోటీశ్వరుడి ఇంటికి అల్లుడ్ని అవుతాననీ, గత వైభవాన్ని తిరిగి తెస్తాననీ, తొలి శుభలేఖ మీకే ఇస్తానని సవాలు విసిరి, కోటీశ్వరుడి అల్లుడు అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెడతాడు.
అలాంటి టైమ్‌లో అతనికి పక్క ఊరి జమీందార్ ఏకైక కుమార్తె చారులత(మీనాక్షి చౌదరి) తారసడుతుంది. తన తెలివిని ఉపయోగించి చారులతను ప్రేమలో పడేస్తాడు. చారులత కూడా ఇంట్లో ఒప్పించి, రాజును వివాహం చేసుకుంటుంది. పెళ్లి అయ్యాక రాజుకు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? రాజు కోటీశ్వరుడి అల్లుడు అయ్యాడా? గత వైభవాన్ని సాధించాడా? బంధువుల దగ్గర హీరోగా నిలిచాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
కథనం
ఏదైనా ఒక పాత కథను కొత్త కోణంలో చెప్పడం ఒక పద్ధతి. లేదంటే పాత కథనే మరింత ఆసక్తికరంగా చెప్పడం రెండో పద్ధతి. ‘అనగనగా ఒక రాజు’ విషయానికి వస్తే, ఇది రెండో కోవకి చెందిన కథగా చెప్పుకోవచ్చు. విలేజ్ నేపథ్యం .. గ్రామీణ రాజకీయాలు .. అక్కడి మనుషుల స్వరూప స్వభావాల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. ఆసక్తికరంగా ఆవిష్కరించాడు.
ఎంతసేపు తాను విలాసంగా .. వైభవంగా గడపాలి, బరువు బాధ్యతలు లేకుండగా బ్రతకాలి అనే స్వార్థంతో ఆలోచించే ఒక యువకుడి చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ పాత్రను నడిపించిన విధానం ఆడియన్స్ ఆశించే వినోదాన్ని వడ్డిస్తూ వెళుతుంది. ఫస్టాఫ్ లో ‘ఆపరేషన్ చారులత’ ఎపిసోడ్, సెకండాఫ్ లో రీల్స్ ద్వారా రాజకీయాల ప్రచారం వంటి ఎపిసోడ్స్ మరింత ఫన్ గా అనిపిస్తాయి. కామెడీని పరుగులు తీయిస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: