ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా,జాన్వీకపూర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హోమ్‌బౌండ్’. 2026లో జరగనున్న 98వ అకాడమీ అవార్డుల రేసులో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో షార్ట్‌లిస్ట్ అయ్యింది ‘హోమ్‌బౌండ్’ సినిమా (Homebound Movie). పోలీసు కావాలనే తమ కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో కుల,మత వివక్షను ఎదుర్కొంటూ ఇద్దరు స్నేహితులు చేసిన పోరాటమే ఈ చిత్ర కథాంశం.. ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, (Homebound Movie) నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ సినిమాగా గుర్తింపు పొందింది.
Read Also: Thama Movie: ‘థామా’ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ
తుది జాబితాను జనవరి 22న ప్రకటించనున్నారు
98వ అకాడమీ అవార్డుల కోసం మొత్తం 12 విభాగాల్లో ఎంపికైన చిత్రాల జాబితాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది. అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘హోమ్‌బౌండ్’ చిత్రంతో పాటు అర్జెంటీనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్ వంటి దేశాల చిత్రాలు కూడా పోటీలో ఉన్నాయి. ఆస్కార్ తుది నామినేషన్లను 2026 జనవరి 22న ప్రకటించనుండగా, మార్చి 15న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
‘హోమ్‌బౌండ్’ సినిమా దర్శకుడు ఎవరు?
‘హోమ్‌బౌండ్’ సినిమాను బాలీవుడ్ దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించారు.
‘హోమ్‌బౌండ్’ సినిమాలో ప్రధాన పాత్రల్లో ఎవరు నటించారు?
ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: