ప్రపంచ సినీ ప్రేక్షకులను తనదైన శైలితో అలరించిన ప్రముఖ హాలీవుడ్ (Hollywood) నటి, ఎమ్మీ అవార్డు విజేత కేథరీన్ ఓ’హారా (71) ఇక లేరు. శుక్రవారం ఆమె లాస్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూసినట్లు ఏజెన్సీ ధృవీకరించింది. కెనడియన్ హాస్య రంగం నుండి ప్రస్థానం మొదలుపెట్టిన ఓ’హారా, ఇటీవలే ‘ది లాస్ట్ ఆఫ్ అస్’లో తన నటనకు ఎమ్మీ నామినేషన్ పొందారు. ఈ వార్తతో హాలీవుడ్‌తో పాటు కెనడియన్ చిత్ర పరిశ్రమ, టెలివిజన్ రంగం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దశాబ్దాల పాటు కొనసాగిన ఆమె సినీ ప్రయాణం అనేక మరపురాని పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది.
Read Also: Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: