సినీ ప్రేమికుల లో, థియేటర్లలో ఏ సినిమాలు విడుదలవుతున్నాయి, ఏవి హిట్ అవుతున్నాయి అన్న ఆసక్తి ఎంత ఉంటుందో, అదే స్థాయిలో ఓటీటీ (OTT) లో స్ట్రీమింగ్‌కు వచ్చే కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా పని ఒత్తిడితో థియేటర్‌కు వెళ్లలేని వారు లేదా తమకు ఇష్టమైన సినిమా హాల్‌లో చూడలేక మిస్ అయిన వారు, ఓటీటీలో చూసుకోవచ్చు.
Read Also: Globe Trotter Event Passport: మహేష్–రాజమౌళి ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌కు ఫ్యాన్స్ క్రేజ్ పీక్!
ఏ ఏ సినిమాలు ఓటీటీలో (OTT) కి వచ్చాయి
ఈ నేపథ్యంలోనే ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇక ఏ ఏ సినిమాలు ఓటీటీలో (OTT) కి వచ్చాయి అనేది చూసుకుంటే.ఇటీవల థియేటర్లలో సందడి చేసి ‘ తెలుసు కదా ’ (Telusu Kada ), ‘ డ్యూడ్ ’ (Dude) చిత్రాలు శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్‌కు రావడం సినీ ప్రేమికుల్లో ఉత్సాహం పెంచింది. థియేటర్‌లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న
ఈ రెండు సినిమాలు ఇప్పుడు డిజిటల్ వేదికపై ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో అనేది ఆసక్తికర అంశంగా మారింది. ఇందులో కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ కూడా ఉంది. ఒకవైపు గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం (The Girlfriend movie) థియేటర్‌లలో దూసుకుపోతుంటే.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంత చిత్రం కూడా మంచి పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది.
ఆహా
కే ర్యాంప్ (మూవీ) – తెలుగు
జియో హాట్‌స్టార్
జురాసిక్ వరల్డ్ రీ బర్త్ (మూవీ) – ఇంగ్లీష్, తెలుగు
జాలీ ఎల్‌ఎల్‌బీ (మూవీ) హిందీ
అవిహితం (మూవీ) మలయాళం
నెట్‌ఫ్లిక్స్
తెలుసు కదా (మూవీ) – తెలుగు
డ్యూడ్ (మూవీ) – తెలుగు, తమిళం
దిల్లీ క్రైమ్: సీజన్3 (వెబ్‌సిరీస్) హిందీ/తెలుగు
ఫ్యూచర్ మ్యాన్ (మూవీ) ఇంగ్లీష్
అన్సెంటియా: సీజన్2 (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
ఎ క్వైట్ ప్లేస్: డే వన్ (మూవీ) ఇంగ్లీష్
ఇన్ యువర్ డ్రీమ్స్ (మూవీ) ఇంగ్లీష్
ట్వింక్లింగ్ వాటర్‌మెలాన్ (మూవీ)కొరియన్
డ్రాగన్ బాల్జ్: సీజన్5 (వెబ్‌సిరీస్) జపనీస్
అమెజాన్ ప్రైమ్
ఆర్ వీ గుడ్ (మూవీ) ఇంగ్లీష్ రెంటల్
బుల్ రన్ (మూవీ) ఇంగ్లీష్ రెంటల్
జీ5
ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్)
ఈటీవీ విన్
ఏనుగుతొండం ఘటికాచలం (మూవీ) – తెలుగు
ఈగో (మూవీ) తెలుగు నవంబరు 16
సన్‌నెక్ట్స్
ఎక్క (మూవీ) కన్నడ
హెచ్‌బీవో మ్యాక్స్
ఎడ్డింగ్టన్ (మూవీ) ఇంగ్లీష్
మనోరమా మ్యాక్స్
కప్లింగ్ (మలయాళం)
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: