బాలీవుడ్‌లో రొమాంటిక్ కామెడీ జానర్‌లో ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన చిత్రం ‘దే దే ప్యార్ దే’. 2019 (‘De De Pyaar De’. 2019) లో విడుదలైన ఈ సినిమా, అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ కాస్ట్, హాస్యభరిత కథనం, ఆకట్టుకునే డైలాగ్‌లతో ప్రేక్షకులను మైమరిపించింది.
సినిమా ప్రేక్షకుల, విమర్శకుల నుండి మంచి స్పందనను పొందడమే కాక, బాక్సాఫీస్ వద్ద కూడా విజయాన్ని సాధించింది. ఆ సినిమా విజయానికి ఆధారంగా, మేకర్స్ సీక్వెల్ కోసం నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Hrithik Roshan: నేడు ఢిల్లీ హైకోర్టుకు హృతిక్.. కారణం ఏంటంటే?
అయితే ఇదే చిత్రానికి సీక్వెల్‌ను తీసుకువచ్చారు మేకర్స్. ‘దే దే ప్యార్ దే 2’ (‘De De Pyaar De 2’) అంటూ ఈ చిత్రం రాబోతుండగా నవంబర్ 14 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
(‘De De Pyaar De 2’) ఫస్ట్ పార్ట్‌లో తనకంటే వయసులో చాలా చిన్నదైన ఆయేషా (రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆశీష్ (అజయ్ దేవగణ్) తన మాజీ భార్య (టబు) పర్మిషన్‌తో పాటు ఆమె కుటుంబం అంగీకారాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈ సీక్వెల్‌లో ఆశీష్ ఆయేషా కుటుంబాన్ని ఎలా పెళ్లికి ఒప్పిస్తాడు అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ కంటే ఇందులో కామెడీ ఎక్కువగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: