Ranveer Singh: తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఈ కేసుపై అత్యవసర విచారణ (Urgent Hearing) చేపట్టాలని రణ్‌వీర్ తరపు న్యాయవాదులు కోరగా, న్యాయస్థానం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. సాధారణ పౌరుల మాదిరిగానే ప్రక్రియ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.
Read also: Balayya-Puri Combo: బాలయ్య-పూరీ జగన్నాథ్ కాంబోలో మరో సినిమా?
రేపటి విచారణపై ఉత్కంఠ
సెలెబ్రిటీ అయినంత మాత్రాన ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండబోదని వ్యాఖ్యానించింది. పిటిషనర్ బాలీవుడ్ స్టార్ కాబట్టి విచారణ వేగవంతం చేయాలా? అని జస్టిస్ నాగప్రసన్న ప్రశ్నించారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. రిషభ్ షెట్టిని వెక్కిరిస్తూ ఫొటోలకు ఫోజు ఇవ్వడం పట్ల రణ్‌వీర్ సింగ్ పై బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. హిందూ మతపరమైన మనోభావాలు, కర్ణాటక తీరప్రాంత చాముండి దైవ సంప్రదాయాన్ని కించపరిచారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. బీఎన్ఎస్ లోని సెక్షన్లు 196, 299, 302 కింద బెంగళూరుకు చెందిన అడ్వొకేట్ ప్రశాంత్ మెథాల్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు.
గత ఏడాది నవంబర్ 28న గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు వేడుకల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పంజుర్లి, గుళిగ దేవుళ్ల హావభావాలను అసభ్యకరంగా, హాస్యాస్పదంగా అనుకరించారని మెథాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన చాముండి దైవాన్ని ఆడదెయ్యం అని రణ్‌వీర్ సింగ్ అభివర్ణించారని తెలిపారు. చాముండి అమ్మవారిని కోస్టల్ కర్ణాటక ప్రాంత ప్రజలు నిత్యం పూజిస్తారని,
దివ్య శక్తికి ప్రతీకగా భావిస్తారని స్పష్టం చేశారు. అలాంటి శక్తిమంతమైన అమ్మవారిని దెయ్యంగా చిత్రీకరించడం భక్తుల మనోభావాలను గాయపరిచిందని పేర్కొన్నారు. ఈ చర్య ఉద్దేశపూర్వకం, ద్వేషపూరితమైనదని, మతపరమైన భావాలను రెచ్చగొట్టడం, సమాజంలో విద్వేషాన్ని ప్రోత్సహించినట్టవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు బెంగళూరులోని ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ దశలో ఉంది. తదుపరి విచారణ ఏప్రిల్ 8న జరగనుంది.
ఎటువంటి దురుద్దేశం లేదు
దీన్ని కొట్టివేయాలంటూ తాజాగా రణ్‌వీర్ సింగ్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ తాజాగా న్యాయమూర్తి ఎం నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. రిషబ్ షెట్టి నటన, పాత్ర ఔచిత్యం, ఆ చిత్రాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసించడానికే తాను అలా చేశానని, ఇతర ఎటువంటి దురుద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, నేరపూరిత కోణాన్ని ఆపాదించారని రణ్‌వీర్ సింగ్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే రెండు నోటీసులు జారీ చేశారని, అనవసర ఒత్తిడిని రణ్‌వీర్ ఎదుర్కొంటున్నారని పిటిషన్‌లో వివరించారు. ఈ కేసును అత్యవసరంగా విచారణకు స్వీకరించాలన్న అతని తరపు న్యాయవాది అభ్యర్థనపై విచారణ సందర్భంగా కోర్టు కీలక ప్రశ్నలు సంధించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: