📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Harish Shankar: మహేశ్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన దర్శకుడు హరీశ్‌ శంకర్

Author Icon By Saritha
Updated: March 11, 2026 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Harish Shankar: ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు అభిమానులకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రచార కార్యక్రమాల సందర్భంగా సోషల్ మీడియాలో తాను చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించి వివరణ ఇచ్చారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమాని ఒకరు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మహేశ్‌ బాబు సినిమా రికార్డులను బద్దలు కొట్టాలని ఆశిస్తూ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు హరీశ్‌ శంకర్ రిప్లై ఇవ్వడంతో మహేశ్ ఫ్యాన్స్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హరీశ్‌ శంకర్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Read Also: Allu Cinemas: రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

Harish Shankar: Director Harish Shankar apologizes to Mahesh fans

ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరిన దర్శకుడు

ఈ వివాదంపై హరీశ్‌ శంకర్ వెంటనే స్పందించారు. సినిమా షూటింగ్, సెన్సార్ పనుల హడావుడిలో ఉండటం వల్ల ఆ ట్వీట్‌ను పూర్తిగా చదవలేదని, కేవలం అభిమాని ఉత్సాహాన్ని చూసి పొరపాటున స్పందించానని తెలిపారు. తనకు మహేశ్‌ బాబు అంటే ఎంతో గౌరవమని, గతంలో ఆయన ‘పోకిరి’ సినిమాను ఎంతగానో ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజమౌళి-మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో రాబోయే సినిమా భారీ రికార్డులు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన రిప్లై వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

harish shankar Mahesh Babu Pawan Kalyan Ustaad Bhagat Singh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.