పవన్ కల్యాణ్ నుంచి రీమేక్ సినిమాల తర్వాత వచ్చిన స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇది. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ వంటి చిత్రాల తరువాత అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సినిమా హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu). చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అని మేకింగ్ దశ నుంచే పెద్ద అంచనాలు నెలకొన్నాయి. నిర్మాణంలో చాలావరకు ఆలస్యం అయినా, చివరకు ఇది థియేటర్లలోకి వచ్చేసింది.
కథ
ఈ కథ 16వ శతాబ్దంలో మొదలవుతుంది. ఢిల్లీలో ఔరంగజేబు (బాబీ డియోల్) పాలన, గోల్కొండ కేంద్రంగా కుతుబ్ షాహిల పరిపాలన కొనసాగుతున్న రోజులవి. హిందూ మతాన్ని అణచివేసే దిశగా ఔరంగజేబు తన దుర్మార్గపు పాలన కొనసాగిస్తూ ఉంటాడు. అప్పట్లో ‘కొల్లూరు’లో వజ్రాల వేట కొనసాగుతూ ఉండేది. అందువలన గోల్కొండ (Golconda) ద్వారా ఢిల్లీకి వజ్రాల తరలింపు జరుగుతూ ఉంటుంది. అలా ‘కొల్లూరు’లో బయటపడిన ‘కోహినూర్ వజ్రం’, ఢిల్లీలోని మొఘల్ రాజుల అధీనంలోకి వెళుతుంది.ఇది ఇలా ఉండగా సనాతన ధర్మం పట్ల సంపూర్ణమైన విశ్వాసం కలిగిన ఒక బ్రాహ్మణ దంపతులకు లభించిన శిశువు, ‘హరిహర వీరమల్లు’ (పవన్ కల్యాణ్)గా పెరిగి పెద్దవాడవుతాడు. వజ్రాలువాటి ఖరీదు విషయంలో అతనికి పూర్తి అవగాహన ఉంటుంది. వజ్రాలను దొంగిలించి వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో అతను పేదలకు సాయపడుతూ ఉంటాడు. స్థానికంగా ఉండే దొరలు మాత్రం అతనిని దొంగగా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే అతని ధైర్య సాహసాల విషయంలో వాళ్లందరికీ భయం ఉంటుంది.
కథనం
ఔరంగజేబు అధీనంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తనకి తెచ్చిపెట్టమని వీరమల్లుని గోల్కొండ సుల్తాన్ తానీషా కోరతాడు. అందుకు వీరమల్లు అంగీకరిస్తాడు. అయితే సుల్తాన్ బందీగా ఉన్న పంచమి ( నిధి అగర్వాల్)ను అక్కడి నుంచి విడిపించుకుని వెళ్లాలని అతను నిర్ణయించుకుంటాడు. పంచమి ఎవరు? ఆమెను విడిపించాలనే అతని ప్రయత్నం ఫలిస్తుందా? కోహినూర్ వజ్రాన్ని తీసుకొస్తానని వీరమల్లు ఒప్పుకోవడానికి గల కారణం ఏమిటి? అనేది మిగతా కథ. ‘వీరమల్లు’ అనే ఒక వజ్రాల దొంగ, మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు (Aurangzeb) ను సైతం అయోమయంలో పడేస్తాడు. ఒక మారుమూల గ్రామానికి చెందిన వీరమల్లు, అంచలంచెలుగా ఔరంగజేబు వరకూ ఎందుకు వెళతాడు? ఆ ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? అనే ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు.
హరిహర వీర మల్లు సినిమా నిజమైన కథ ఆధారంగా తీయబడిందా?
హరిహర వీర మల్లు సినిమా ఒక కల్పిత కథ (fictional story). ఇది చారిత్రక నేపథ్యంతో రూపొందించినా, ఇందులో చూపిన వీర మల్లు అనే వ్యక్తి నిజ జీవితంలో లేరు.
హరిహర వీర మల్లు సినిమాలో విలన్ ఎవరు?
హరిహర వీర మల్లు సినిమాలో బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడు (విలన్)గా నటించారు. ఆయన ఈ చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Vijay Devarakonda: బెట్టింగ్ యాప్స్ కేసులో హీరో విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు