📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Hansika Motwani: పెళ్లి ఫోటోలు డిలీట్ తో విడాకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హన్సిక

Author Icon By Ramya
Updated: August 5, 2025 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హన్సిక, సోహైల్ విడాకులు: ముగిసిన బంధం?

సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, విడాకుల వ్యవహారాలు ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా, నటి హన్సిక మోత్వానీ (Hansika Motwani) తన భర్త సోహైల్ కతూరియాకు (Sohail Kathuria) విడాకులు ఇవ్వబోతున్నారనే వార్తలు అభిమానులను షాక్‌కి గురిచేశాయి. రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట బంధం తెగిపోతోందని తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ హన్సిక (Hansika Motwani) తన సోషల్ మీడియా ఖాతాల నుండి భర్తతో ఉన్న అన్ని ఫోటోలను తొలగించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Hansika Motwani

ప్రేమించి, పెళ్లి చేసుకుని..

బాలనటిగా కెరీర్ ప్రారంభించి, తెలుగులో దేశముదురు (Desamuduru) సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక, తన స్నేహితురాలి మాజీ భర్త అయిన సోహైల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2022లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి ప్రేమకథ, పెళ్లి తాలూకు విశేషాలు హన్సికస్ లవ్ షాదీ డ్రామా (Hansika’s Love Shaadi Drama) పేరుతో ఒక డాక్యుమెంటరీగా కూడా విడుదలైంది. అందులో హన్సిక తన ప్రేమ ప్రయాణం గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు.

విడాకుల వార్తలు, సోషల్ మీడియాలో సంకేతాలు

కొన్ని రోజులుగా హన్సిక, సోహైల్ మధ్య విభేదాలు తలెత్తాయని, వారు విడివిడిగా ఉంటున్నారని వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లో సోహైల్ ఈ వార్తలను ఖండించారు. కానీ ఇప్పుడు హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ నుండి సోహైల్‌తో ఉన్న అన్ని ఫోటోలను, ముఖ్యంగా పెళ్లి ఫోటోలను తొలగించడంతో ఈ విడాకుల వార్తలకు మరింత ప్రాధాన్యత లభించింది. సోహైల్ పెళ్లి ప్రపోజ్ చేసినప్పటి నుంచి పెళ్లి వేడుకల వరకు ఉన్న అన్ని జ్ఞాపకాలను హన్సిక తొలగించారు. దీంతో ఈ జంట విడిపోయారనే విషయం దాదాపు ఖాయం అయినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

హన్సిక మోత్వాని ఎవరిని పెళ్లి చేసుకుంది?

మోత్వానీ తన చిరకాల ప్రియుడు, వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాను డిసెంబర్ 4, 2022న జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో వివాహం చేసుకుంది.

హన్సిక మోత్వానీపై వచ్చిన ఆరోపణలు ఏమిటి?

రోకా మరియు వివాహ వేడుకల సమయంలో శ్రీమతి హన్సిక మోత్వానీ బహుమతులుగా ఫ్యాన్సీ వాచీలు, అన్యదేశ పండ్లు అలాగే డ్రై ఫ్రూట్స్ డిమాండ్ చేశారని మరియు ఉదయపూర్‌లో ఒక ఫ్యాన్సీ వివాహ వేదిక కోసం తన ఫ్లాట్‌ను అమ్మి ₹20 లక్షలు చెల్లించాలని బలవంతం చేశారని ఆమె ఆరోపించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/dhanush-mrunal-rumored-relationship-update/cinema/526294/

Breaking News Celebrity Divorce Hansika Motwani latest news Social Media Buzz Sohail Kathuria South Indian Actress Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.