📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: GV Prakash: జీవీ ప్రకాశ్-సైంధవి జంటకు అధికారికంగా విడాకులు

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 9:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రసిద్ధ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, గాయని సైంధవి (GV Prakash-Saindhavi) ల వివాహ బంధం అధికారికంగా ముగిసింది. చెన్నై ఫ్యామిలీ కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుతో వీరి 12 ఏళ్ల పెళ్లి జీవితానికి ముగింపు పలికింది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం ఈ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేసిన అనంతరం కోర్టు విడాకులు మంజూరు చేసింది.

Chiranjeevi-కుటుంబ సభ్యులతో కలిసి ఓజీ సినిమా చూసిన చిరంజీవి

జీవీ ప్రకాశ్ కుమార్ తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్, కొలీవుడ్,టాలీవుడ్ సినిమాలకు సంగీతం అందిస్తూ ఆయన విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. మరోవైపు, సైంధవిల గాయని గా పలు స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చి, పాటల ద్వారా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

వీరిద్దరూ సుదీర్ఘ పరిచయం తర్వాత 2012లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత సినీ, సంగీత రంగంలో అనేక కార్యక్రమాలకు కలిసి హాజరవుతూ ఒక ఆదర్శ జంటగా గుర్తింపు పొందారు.

మనస్పర్థల కారణంగా విడివిడిగా ఉంటున్న విషయం

కొంతకాలంగా వీరిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ 12 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట,

GV Prakash

ఈ ఏడాది మార్చి 24న చెన్నైలోని మొదటి అదనపు ఫ్యామిలీ కోర్టు (Family Court) లో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి సెల్వ సుందరి, చట్ట ప్రకారం ఆరు నెలల గడువు ఇచ్చారు.

సెప్టెంబర్ 25న కేసు మళ్లీ విచారణకు రాగా

ఆ గడువు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 25న కేసు మళ్లీ విచారణకు రాగా, జీవీ ప్రకాశ్, సైంధవి ఇద్దరూ స్వయంగా కోర్టుకు హాజరై విడిపోవాలన్న తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు. విచారణ సందర్భంగా వారి కుమార్తె ఎవరి వద్ద ఉంటుందని న్యాయమూర్తి ప్రశ్నించగా, చిన్నారి తల్లి సైంధవి సంరక్షణలోనే ఉండటానికి జీవీ ప్రకాశ్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

ఇరువర్గాల అంగీకారాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, వారి విడాకులను ఖరారు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. కాగా, 2013లో వివాహం చేసుకున్న ఈ జంటకు 2020లో ఒక కుమార్తె జన్మించింది. విడాకుల అనంతరం పాప తల్లి సైంధవి వద్దే పెరగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News celebrity divorce news chennai family court gv prakash divorce gv prakash kumar Kollywood Updates latest news saindhavi divorce singer saindhavi Tamil Cinema News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.