Happy Raj Telugu Movie Trailer Release: స్టైలిష్ లుక్‌లో అబ్బాస్ రీ-ఎంట్రీ: ‘హ్యాపీ రాజ్’ విశేషాలు

Read Time:  1 min
Happy Raj Telugu Movie Trailer Release: స్టైలిష్ లుక్‌లో అబ్బాస్ రీ-ఎంట్రీ: ‘హ్యాపీ రాజ్’ విశేషాలు
FONT SIZE
GET APP
gv-prakash-kumar-happy-raj-movie-trailer-abbas-re-entry-details
gv-prakash-kumar-happy-raj-movie-trailer-abbas-re-entry-details

చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపిస్తున్న అబ్బాస్, ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో మెరిశారు. ట్రైలర్‌లో ఆయన స్టైలిష్ లుక్ చూస్తుంటే ఒకప్పటి ‘ప్రేమ దేశం’, ‘చెలి’ సినిమాలను గుర్తుకు తెస్తోంది.

Read Also: Prakash Raj: ‘ధురంధర్’ 2 పై నటుడు ప్రకాశ్‌ రాజ్ ఏమన్నారంటే?

Happy Raj Telugu Movie Trailer Release: కథ, పాత్రలు

జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘హ్యాపీ రాజ్’ (Happy Raj) చిత్రంతో ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అబ్బాస్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. హీరోయిన్‌గా తెలుగు న‌టి శ్రీ గౌరీ ప్రియ న‌టిస్తుండ‌గా.. ఆమె తండ్రిగా, అమెరికాలో నివసించే ‘రాజీవ్’ అనే ఎన్నారై పాత్రలో అబ్బాస్ క‌నిపించ‌బోతున్నాడు.

ట్రైలర్‌లో ఆయన లుక్ చూస్తుంటే, ఒకప్పటి ‘మిన్నలే’ (తెలుగులో ‘చెలి’) సినిమాలోని అబ్బాస్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్నారు..రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండ‌గా.. ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరియు రొమాంటిక్ కామెడీగా రాబోతుంది. పెళ్లి పీటల వరకు వెళ్లాలనుకునే ఒక జంటకు, వారి కుటుంబాల మధ్య ఎదురయ్యే సరదా సంఘటనలు, ఎమోషన్స్‌తో ఈ సినిమా రూపొందింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.