📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Gouri Kishan: నటి పై బాడీ షేమింగ్.. క్షమాపణలు చెప్పిన రిపోర్టర్

Author Icon By Anusha
Updated: November 9, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Gouri Kishan

తమిళంలో విడుదలైన 96 సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష టీనేజ్ పాత్రలో నటించి ఆకట్టుకుంది గౌరీ కిషన్ (Gouri Kishan). అదే చిత్రాన్ని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేయగా.. తెలుగులోనూ అదే పాత్రలో కనిపించింది. కేరళకు చెందిన గౌరీ కిషన్ తెలుగుతోపాటు,తమిళంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Read Also: Shraddha Kapoor: Zootopia మూవీకి శ్రద్ధా వాయిస్ ఓవర్

ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా రాణిస్తుంది. తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. విజయ్ మాస్టర్, ధనుష్ కర్ణన్, జి.వి. ప్రకాష్ అడియే, ఉలగమై, హాట్‌స్పాట్ వంటి చిత్రాలతో పాపులర్ అయ్యింది గౌరీ. ఆమె ప్రస్తుతం అదర్స్ చిత్రంలో నటిస్తోంది.

అబిన్ హరికరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదలైంది. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంది.ఈ క్రమంలో నవంబర్ 6న చెన్నైలో ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుండగా.. అక్కడే ఉన్న ఓ విలేకరి మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారు ?’ అని అడిగారు. దీంతో గౌరీ కిషన్ (Gouri Kishan) సీరియస్ అయ్యింది.

తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యూట్యూబర్

అయితే, ఆమె బరువు గురించి అభ్యంతరకరమైన ప్రశ్న అడిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యూట్యూబర్- జర్నలిస్ట్ ఆర్.ఎస్. కార్తీక్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. అయితేతన ప్రశ్న ఉద్దేశం వేరే విధంగా ఉందని, అది సరదాగా అడిగిందే తప్ప, బాడీ షేమింగ్ చేసేందుకు కాదని ఆయన వివరణ ఇవ్వడం గమనార్హం.

తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. కాగా యూట్యూబర్ ప్రశ్నపై తమిళనాట చర్చనీయాంశంగా మారగా పలువురు సినీ ప్రముఖులు గౌరీకి మద్దతుగా నిలిచారు.సోషల్ మీడియాలో ఈ వివాదం పెద్ద చర్చనీయాంశమైన నేపథ్యంలో కార్తీక్ ఒక వీడియో ద్వారా స్పందించారు.

గౌరీ కిషన్ దానిని వేరే విధంగా అర్థం చేసుకున్నారు

“గత కొన్ని రోజులుగా నేను చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. నేను ఒక ఉద్దేశంతో ప్రశ్న అడిగాను, కానీ గౌరీ కిషన్ దానిని వేరే విధంగా అర్థం చేసుకున్నారు. ఈ ప్రశ్న వలన ఆమె మనసు బాధపడి ఉంటే, దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను” అని కార్తీక్ పేర్కొన్నారు.

అయితే తన ప్రశ్నలో ఎలాంటి తప్పు లేదని వాదిస్తూ, హీరో ఆమెను సినిమాలో ఎత్తే సన్నివేశం గురించి సరదాగా అడగాలని మాత్రమే తాను భావించానని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా బాధపెట్టే ఆలోచన లేదని కార్తీక్ చెప్పారు. ఆమె దానిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Body Shaming Gouri Kishan latest news RS Karthik Tamil Actress Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.