हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Good Bad Ugly: ఓటీటీలోకి గుడ్ బ్యాడ్ అగ్లీ..ఆదాయంలో రికార్డ్

Sharanya
Good Bad Ugly: ఓటీటీలోకి గుడ్ బ్యాడ్ అగ్లీ..ఆదాయంలో రికార్డ్

కోలీవుడ్ మాస్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ “గుడ్ బ్యాడ్ అగ్లీ” ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో మే 8 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. విడుదలైన తొలి రోజునే భారీ వ్యూస్, ట్రెండింగ్ టాప్ 10లో చోటు దక్కించుకోవడం చిత్రానికి ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.

భారీ కలెక్షన్లు – రూ. 250 కోట్లు దాటిన వసూళ్లు

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మొదటి వారంలోనే రూ. 100 కోట్ల మార్క్ దాటి పోయింది. అజిత్ కుమార్ పవర్‌, అధిక్ రవిచంద్రన్ మాస్ టేకింగ్‌, జీవీ ప్రకాశ్ సంగీతం కలిసి బాక్సాఫీస్ వద్ద మేజిక్ సృష్టించాయి. మొత్తం కలెక్షన్లు రూ. 250 కోట్లకు చేరటం ఈ చిత్రాన్ని అజిత్ కెరీర్‌లో మునుపెన్నడూ లేని స్థాయిలో నిలిపింది.

కథా నేపథ్యం –

కథలో అజిత్ కుమార్ మూడు విభిన్న కోణాల్లో కనిపిస్తారు –ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటించింది. పుష్ప సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమానూ రూపొందించడం, టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.250 కోట్లకు వరకు కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీలో ఏకే అలియాజ్ రెడ్ డ్రాగన్ అనే గ్యాంగ్‍స్టర్ గా అజిత్ నటన ఆడియెన్స్ ను మెప్పించింది. ఇక త్రిష అందచందాలు, ప్రియా ప్రకాశ్ వారియర్, అర్జున్ దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్, జాకీ ష్రాఫ్ ల అభినయం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ప్రసన్న, సునీల్, రెడిన్ కింగ్ స్లే, షైన్ టామ్ చాకో, టినూ ఆనంద్, షయాజీ షిండే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే పెద్ద అండర్ వరల్డ్ డాన్ అయిన ఏకే (అజిత్ ) తన ఫ్యామిలీ కోసం కొన్ని నేరాల‌పై అరెస్ట్ అయి చాలా కాలంగా జైల్లో ఉంటాడు. ఓ రోజు కుమారుడు విహాన్ తండ్రిని చూడాల్సిందే అని బ‌ల‌వంతం చేయ‌డంతో జైల్లో ఉన్న ఏకే కుటుంబాన్ని క‌ల‌వ‌డం కోసం బయటకు వస్తాడు. అదే సమయంలో కొన్ని గ్యాంగులు ఏకే ఫ్యామిలీపై దాడికి పాల్పడుతాయి. కుమారుడు విహాన్ వాళ్లకు చిక్కుతాడు. మరి ఏకే తన కుమారుడిని ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ సినిమా స్టోరీ. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, అజిత్ ఫ్యాన్స్, యాక్ష‌న్ సినిమా చూడాల‌నుకునే వారు ఈ సినిమాను చూసేయ‌వ‌చ్చు.

ఓటీటీలో రిలీజ్ – మల్టీ లాంగ్వేజ్ స్ట్రీమింగ్

థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‏ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే 8 నుంచి అజిత్ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే గురువారం అర్ధరాత్రి నుంచే ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.

Read also: HIT 3 Movie: HIT 3 లో అందరిని ఆకట్టుకున్న కోమలీ ప్రసాద్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870