📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమ్ చేంజ‌ర్‌’ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్‌

Author Icon By Divya Vani M
Updated: January 12, 2025 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన సినీ స్థాయిని పెంచుకున్నాడు.త్రిబుల్ ఆర్’వంటి అద్భుత విజయం తర్వాత, రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్‘ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.ఇది ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. దిల్ రాజు బ్యానర్‌పై 350 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, ఆయన 50వ ప్రాజెక్ట్ కూడా.సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన గేమ్ చేంజర్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రిలీజ్ రోజు నుంచే సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.186 కోట్లు వసూలు చేసింది. పండుగ సీజన్‌ కావడంతో రెండో రోజు కూడా దూసుకెళ్లింది.

మెగా అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి వసూళ్లలో మంచి ఊపు వచ్చింది.రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించాడు.ప్రజా నాయకుడు అప్పన్నగా, ప్రజా సమస్యలపై పోరాటం చేసే కలెక్టర్ రామ్ నందన్‌గా చరణ్ చూపిన నటన అందర్నీ ఆకట్టుకుంది.ఆయన డాన్స్‌లు కూడా ప్రేక్షకులను అలరించాయి. హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్‌తో ఆకట్టుకోగా, అన్జలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, జయరాం,సునీల్ వంటి ప్రముఖులు తమ పాత్రల్లో బాగా ఒదిగిపోయారు.దర్శకుడు శంకర్ ప్రతి సన్నివేశాన్ని గ్రాండియస్‌గా తీర్చిదిద్దారు.నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ సినిమా నిర్మించారు.

మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా,విడుదల తర్వాత ఆ అంచనాలను మించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.రామ్ చరణ్‌ను శంకర్ ఎలా చూపిస్తారో అని ఎదురుచూసిన ప్రేక్షకులకు అదిరిపోయే అనుభూతి వచ్చింది.చరణ్ మాస్ పెర్ఫార్మెన్స్, శంకర్ మాస్టర్ టేకింగ్ కలిసి ఈ సినిమాను సంక్రాంతి సీజన్‌లో కలెక్షన్ల తుఫాను సృష్టించేందుకు కారణమయ్యాయి.సినిమాను ఘనవిజయంగా మార్చిన అభిమానులు చరణ్ ఇంటికి వెళ్లి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

DilRaju GameChanger KiaraAdvani MegaPowerStar Ramcharan Shankar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.