📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gaddar Awards: విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు: నాగార్జున

Author Icon By Anusha
Updated: March 7, 2026 • 2:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gaddar Awards: తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డులను ప్రకటించింది. గత ఏడాది సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను పరిశీలించిన జ్యూరీ, ‘తండేల్’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన అక్కినేని నాగచైతన్యను ‘ఉత్తమ నటుడు’ (Best Actor) కేటగిరీకి ఎంపిక చేసింది. చైతూ కెరీర్‌లో ఇది రెండో స్టేట్ అవార్డు కావడం విశేషం. గతంలో ‘మనం’ సినిమాకు ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్న ఆయన, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి తొలి గద్దర్ అవార్డును దక్కించుకున్నారు.

Read Also: Vijay Sangeetha Divorce: విజయ్-సంగీత విడాకుల కేసులో ట్విస్ట్

“దుమ్ములేపావు నాన్న”.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్!

తన కుమారుడు ఉత్తమ నటుడిగా ఎంపికవ్వడంపై అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “2025 గద్దర్ అవార్డు విజేతలందరికీ అభినందనలు. దుమ్ములేపావు నాన్న! నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది” అంటూ ఎక్స్‌ (ట్విట్టర్) లో సంతోషాన్ని పంచుకున్నారు. కుమారుడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆయన పేర్కొన్నారు.

”2025 గద్దర్ అవార్డు విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. నా తండ్రి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు గారి పేరు మీదుగా ‘ANR అవార్డ్’ను ప్రారంభించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నిజంగా ఆయనకు తగిన నివాళి. దీనికి అర్హురాలైన జయసుధ గారికి ఈ అవార్డు లభించినందుకు సంతోషిస్తున్నాను.అని నాగార్జున ఎక్స్ లో పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Gaddar Awards 2025 Winners List Naga Chaitanya nagarjuna thandel movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.