Revanth Reddy : తెలుగు సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రుల మద్దతు ఎప్పుడూ ఉందని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వరకు సినీ రంగానికి స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
డిసెంబరు 9న హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజున అల్లు అరవింద్ ఈ విషయాలు వెల్లడించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ విడుదలకు ముందు, “ది క్రియేటివ్ సెంచరీ: ఇండియా సాఫ్ట్ పవర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్” అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో ఆయన మాట్లాడారు.
భారతీయ సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే, ప్రాంతీయ కథలపైనే దృష్టి పెట్టాలని అల్లు అరవింద్ తెలిపారు.
“అవెంజర్స్ లేదా ట్రాన్స్‌ఫార్మర్స్ లాంటి సినిమాలు చేయాలనే ఆలోచన మనకి అవసరం లేదు. కాంతార, పుష్ప వంటి ప్రాంతీయ రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలే దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి,” అని ఆయన చెప్పారు.
Read Also: Jasprit Bumrah: సౌతాఫ్రికాతో తొలి టీ20.. బూమ్రా సంచలన రికార్డు
ప్రసిద్ధ సినీ నిర్మాత దగ్గుబాటి (Revanth Reddy) సురేష్ మాట్లాడుతూ, 1976 నుంచే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు (సమైక్య ఆంధ్రప్రదేశ్ కాలంలో) తెలుగు సినిమా పరిశ్రమకు మద్దతు ఇచ్చాయని తెలిపారు.
“1970లు, 80లలో చెన్నై నుంచి హైదరాబాద్‌కు తెలుగు సినిమా మారడానికి ప్రభుత్వ సహకారం కీలకంగా నిలిచింది,” అని ఆయన చెప్పారు.
ఇక దర్శకుడు అనిరుద్ధ రాయ్ చౌధరీ మాట్లాడుతూ, సినిమా దర్శకత్వం చేపట్టే ముందు తాను దాదాపు 500 అడ్వర్టైజింగ్ సినిమాలు చేసిన అనుభవాన్ని చేశారు.
“కొత్త దర్శకులు ఎదగాలంటే ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు అవసరం. సినిమాల నిర్మాణాన్ని సులభతరం చేసే సంస్థ ఉంటే మరింత ప్రతిభ బయటకు వస్తుంది,” అని ఆయన అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: