Fourth Floor Movie: తమిళంలో రీసెంటుగా థియేటర్లకు వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్, ఇప్పుడు ఓటీటీకి రావడానికి సిద్ధమవుతోంది. రాజా నిర్మించిన ఈ సినిమాకి సుందరపాండి దర్శకత్వం వహించాడు. సైకలాజికల్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా ‘ఫోర్త్ ఫ్లోర్’. ఈ సినిమా, ఫిబ్రవరి 27వ తేదీన థియేటర్లకు వచ్చింది, నెల తిరగకుండానే ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ధరణ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, తలైవాసల్ విజయ్ సుబ్రమణియన్ శివ ఆదిత్య కథిర్ బేబీ శ్రీవర్షిణి ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘సన్ నెక్స్ట్’ వారు తీసుకున్నారు. ఈ నెల 20 వతేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన వదిలారు.
Read Also: ‘Aspirants 3’ Series Review: ‘ఆస్పిరెంట్స్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

కథ
ధీరన్ (ఆరి అర్జునన్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. గతంలో అను (పవిత్ర) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ మనస్పర్థలతో ఇద్దరూ విడిపోతారు. ఒకరోజు చెన్నైకి రమ్మని ధీరన్ ను ఆహ్వనిస్తుంది అను. సిటీకి వచ్చి అతడు ఒంటరిగా ఓ అపార్ట్మెంట్ లో ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటాడు. పక్క ప్లాట్ లోనే శ్వేత (దీప్శిక) షిప్ట్ అవుతుంది. అయితే చెన్నైకి వచ్చిన తర్వాత ధీరన్ కు అను గురించి ఏం తెలియదు. కానీ ఒక రోజు తాను ఉంటున్న ఫ్లాట్ లోనే అను చిన్నపాపతో ఉన్న ఫోటో దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. ఆద్యంతం ట్విస్టులు.. సస్పెన్స్ తో సాగుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: