ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన ఆరోగ్యం విషమించడంతో, ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కష్టకాలంలో యువ హీరో విష్వక్ సేన్ మానవత్వంతో స్పందించి, వెంకట్ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం (Rs. 2 lakh financial assistance) అందించారు. విష్వక్ సేన్ చేసిన ఈ సాయం పట్ల సినీ వర్గాలతో పాటు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఫిష్ వెంకట్ (Fish Venkat) ఆరోగ్య పరిస్థితి – కుటుంబ విజ్ఞప్తి
ఫిష్ వెంకట్ (Fish Venkat) కుమార్తె స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం, గత కొన్నేళ్లుగా ఆయన డయాలసిస్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయడం లేదని, వైద్యులు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి (Kidney transplant) చేయాలని సూచించారని ఆమె వెల్లడించారు. కిడ్నీ దాత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే ఈ చికిత్సకు అయ్యే ఖర్చు తమకు చాలా భారంగా మారిందని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రభాస్ సాయంపై స్పష్టత – సినీ పెద్దలకు విజ్ఞప్తి
ఇటీవల సోషల్ మీడియాలో ప్రభాస్ సాయం చేస్తున్నారంటూ వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఫిష్ వెంకట్ కుటుంబం స్పష్టం చేసింది. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఈ విషయం ప్రభాస్‌కు తెలిస్తే ఆయన తప్పకుండా సాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమకు ఆర్థిక సాయం అత్యవసరం అని, సినీ పరిశ్రమలోని పెద్దలు, ఇతర నటులు, నిర్మాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వారు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు తోచిన సాయం అందించి తన తండ్రి ప్రాణాలను కాపాడాలని స్రవంతి వేడుకుంటున్నారు. సినీ పరిశ్రమలో ఎంతోమందికి సుపరిచితుడైన ఫిష్ వెంకట్, తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
విష్వక్సేన నటుడు ఎవరు?
విష్వక్ సేన్ (Vishwak Sen) అనగానే ముందేసి గుర్తుకు వచ్చే వ్యక్తి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రతిభావంతుడుగా ఎదిగిన నటుడు, దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్..
విష్వక్ సేన్ టాలీవుడ్‌లో ఎలా గుర్తింపు పొందాడు?
విష్వక్ సేన్ విభిన్న కథాంశాలతో ప్రయోగాలు చేసే నటుడిగా, దర్శకుడిగా పేరుగాంచాడు.
ఫలక్నుమా దాస్, హిట్ వంటి సినిమాలతో యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Moonwalk: ‘మూన్ వాక్’ ( జియో హాట్ స్టార్)సినిమా రివ్యూ!