Film Producer: సినీ పరిశ్రమకు నిర్మాతే అసలైన ప్రాణాధారం అని, కానీ నేటి పరిస్థితుల్లో వారికి తగిన గౌరవం, విలువ దక్కడం లేదని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు నిర్మాతలంటే హీరోలు, హీరోయిన్లు, దర్శకులు మాత్రమే కాకుండా లైట్ బాయ్స్ నుంచి సెట్ బాయ్స్ వరకు అందరూ ఎంతో గౌరవంతో చూసేవారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, డబ్బులు తీసుకునే వారు కూడా ఇచ్చిన వారినే ప్రశ్నించే స్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Operation Sindoor Movie: వెండితెరపై ‘ఆపరేషన్ సిందూర్’ గర్జన!
విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మిస్తా
సీనియర్ ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావుకు సంబంధించి ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత పూర్ణచంద్రరావు కొన్ని సినిమాలనే నిర్మించారని అన్నారు.తన ‘దిల్’ చిత్రాన్ని హిందీలో తీస్తానని, హక్కుల గురించి పూర్ణచంద్రరావు తనను అడిగారని గుర్తు చేసుకున్నారు. ఆయన నిర్మిస్తానంటే హక్కులు ఉచితంగా ఇస్తానని చెప్పానని తెలిపారు. 87 చిత్రాలను నిర్మించిన అట్లూరి సమర్పణలో తాను ఒక సినిమాను నిర్మిస్తానని ప్రకటించారు. విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: