📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

Film Policy : కొత్త ఫిల్మ్ పాలసీ ఈ యేడాది నంది అవార్డులు ఇస్తాం : మంత్రి దుర్గేష్ వెల్లడి

Author Icon By Shravan
Updated: August 12, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Film Policy : రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి (Development) కట్టుబడి ఉన్నామని, త్వరలోనే సమగ్రమైన నూతన ఫిల్మ్ పాలసీని తెస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. వెలగపూడి సెక్రటేరియట్లోని రెండవ బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ మేరకు మంత్రి కందుల దుర్గేష్తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలతో రూపొందించిన డాక్యుమెంట్ని నిర్మాతలు మంత్రి కందుల దుర్గేష్క అందించారు.
సినిమా పరిశ్రమ సమస్యలు, 24 విభాగాల అభివృద్ధిపై సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్తో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి దుర్గేష్ను నిర్మాతలు అభ్య రించారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్లు, కొత్త సినిమా విడుదల, నూతన ఫిల్మ్ పాలసీ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సెప్టెంబర్ మొదటి లేదా రెండోవారంలో సిఎం, డిప్యూటీ సిఎంలతో సమావేశం ఏర్పాటు చేయిస్తా నని హామీఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ సహకారం కావాలని కోరుకుంటున్నారు, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేసి సరైన ప్రతిపాదనలతో రావాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారం, చేస్తున్న కృషిని సినీ నిర్మాతలు అభినందించిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించామన్నారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటు అంశంలో ముందుకు వస్తే ప్రభుత్వ సహకారం అందిస్తామన్నారు.

ఈ అంశంపై త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. నిర్మాతలు సూచించిన సలహాలు, సూచనలు సిఎం, డిప్యూటీ సిఎంల దృష్టికి తీసుకెళ్లడానికి ఈ సమావేశం తొలి మెట్టుగా భావిస్తున్నామన్నారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాల విషయంలో సిఎం చంద్రబాబునాయుడు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ స్పష్టమైన సూచనలు చేశారని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ ఏడాది నంది అవార్డులు తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు. ఏ విధానంలో నంది అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తే చిత్ర పరిశ్రమకు ఉపయోగపడుతుందో ఆ తరహా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలకు సూచించారు. తదుపరి సమావేశంలో నంది అవార్డుల విషయంపై స్పష్టత వస్తుందన్నారు. ఇరు రాష్ట్రాలకు తెలుగు సినిమా ఒక్కటే అన్నారు. ఉత్తమ చిత్రం ఎక్కడైనా ఉత్తమంగానే నిలబడుతుందని అన్నారు. నంది అవార్డుల (Awards) ఎంపిక ఇరు రాష్ట్రాలు కలసి చేయాలా, విడివిడిగా చేయాలనే అంశంపై నిర్మాతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిపారు. ఈ అంశాన్ని సిఎం, డిప్యూటీ సిఎం ల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. సినిమా రూపకల్పన, విధి విధానాల విషయంలో బడ్జెట్ ను ప్రాతిపదికగా తీసుకొని ఏయే సినిమాలకు ప్రభుత్వం తరఫున ఏ రకమైన సాయం అందించాలనే అంశంపై చర్చించామన్నారు. త్వరలోనే ఈ అంశంపై తగు నిర్ణయం తీసుకుంటామని నిర్మాతలకు మంత్రి దుర్గేష్ స్పష్టమైన వివరణ ఇచ్చారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/ap-districts-districts-increased-to-32-new-district-named-amaravati/andhra-pradesh/529270/

AP Government Breaking News in Telugu Durgesh minister Google news Nandi Awards Telugu News Paper Tollywood News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.