📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest News: Kalaimamani Awards 2025: కలైమామణి అవార్డ్స్ అందుకున్న సినీప్రముఖులు

Author Icon By Aanusha
Updated: October 12, 2025 • 9:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం సినీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన కళాకారులను ‘కలైమామణి’ (Kalaimamani Award) పురస్కారంతో సత్కరిస్తూ వస్తోంది. ఈ అవార్డు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ తరపున కళా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందజేయబడుతుంది. తాజాగా 2021, 2022, 2023 సంవత్సరాలకుగాను కలైమామణి పురస్కార గ్రహీతలను ప్రకటించి, చెన్నైలోని వాణి మహల్‌లో శనివారం సాయంత్రం ఘనంగా ప్రదానోత్సవాన్ని నిర్వహించారు.

K-Ramp Movie: కె- ర్యాంప్‌ ట్రైలర్ విడుదల

ఈ వేడుకలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ (M.K. Stalin), ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Deputy CM Udayanidhi Stalin) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సినీ, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 90 మంది కళాకారులు వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్నారు.

నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయకులు, నృత్య కళాకారులు వంటి విభిన్న విభాగాల వారు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.2021కిగానూ నటనా విభాగంలో హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) రాష్ట్ర సీఎం స్టాలిని చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. అలాగే 2023 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా నటుడు కె మణికందన్ అవార్డును గెలుచుకున్నారు.

ఎస్.జె. సూర్య కూడా ఉత్తమ నటుడిగా

విక్రమ్ ప్రభు, ఎస్.జె. సూర్య కూడా ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు ఉత్తమ సంగీత స్వరకర్త అవార్డును అనిరుధ్ రవిచందర్ కు ప్రదానం చేశారు.

ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా సంగీత స్వరకర్త అనిరుధ్ ఈ అవార్డును అందుకున్నారు.కలైమామణి అవార్డు (Kalaimamani Award) కు దర్శకుడు ఎన్. లింగుసామి, గాయని సుజాత మోహన్ సహా వివిధ సినీ ప్రముఖులు హాజరయ్యారు. సంగీతానికి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అవార్డును గాయకుడు కె.జె. యేసుదాస్‌కు ప్రదానం చేశారు. దాదాపు మూడేళ్లకు గానూ మొత్తం 90 మందికి ఈ పురస్కారాలను అందజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

anirudh Breaking News Kalai Mamani Awards latest news SaiPallavi Tamil Nadu CM MK Stalin Telugu News udhayanidhi stalin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.