हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Latest News: Priyanka Arul Mohan:  ఎక్స్‌పోజింగ్ ఫోటోస్ వైరల్.. ప్రియాంక తీవ్ర హెచ్చరిక

Anusha
Latest News: Priyanka Arul Mohan:  ఎక్స్‌పోజింగ్ ఫోటోస్ వైరల్.. ప్రియాంక తీవ్ర హెచ్చరిక

ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) చెన్నైలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ సినీ ప్రపంచంలోకి ప్రవేశం నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో చేసింది. ఆ చిత్రంతోనే ఆమెకు టాలీవుడ్‌లో ఒక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత శర్వానంద్‌తో కలిసి నటించిన ‘శ్రీకారం’ చిత్రంలో ప్రేక్షకుల మన్ననలు పొందింది. అలాగే నానితో నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమాలోనూ ఆమె క్యూట్ లుక్స్,అద్భుతమైన అభినయం ద్వారా మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమా ..హీరోయిన్‌ ఎవరంటే?

ఇటీవల పవన్ కళ్యాణ్ భార్యగా కన్మణి అనే పాత్రలో ఆకట్టుకుంది ప్రియాంక మోహన్ (Priyanka Arul Mohan). ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. తెలుగులో ఎప్పటినుంచో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆమెకు ‘ఓజీ’ (OG Movie) రూపంలో మంచి హిట్ లభించింది.

ఈ చెన్నై బ్యూటీకి తెలుగులో అవకాశాల పరంపర మొదలైందనుకుంటుండగానే, ఆమెకు సోషల్ మీడియా నుంచి తీవ్ర అసహనాన్ని కలిగించే షాక్ తగిలింది. బయట, సినిమాల్లోనూ ఆమె ఎంత పద్ధతిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటిది సోషల్‌మీడియా (Social media) లో ఆమె మొహంతో కొన్ని ఫేక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ప్రియాంక దృష్టికి వెళ్లడంతో ఆమె ఘాటుగా స్పందిస్తూ

అందులో ప్రియాంక అసభ్యంగా, ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ప్రియాంక ఇలా మారిపోయిందేంటి అనుకుంటూ వాటిని తెగ షేర్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం అవి ఫేక్ ఫోటోలని, ప్రియాంక ఎప్పటికీ అలా చేయదని ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు.

ఈ విషయం ప్రియాంక దృష్టికి వెళ్లడంతో ఆమె ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేసింది. ‘ఏఐ ద్వారా నన్ను తప్పుగా చూపిస్తూ క్రియేట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫేక్ ఫోటోల్ని షేర్ చేయడం దయచేసి ఆపండి.

ఏఐ (AI) టెక్నాలజీని క్రియేవిటీ కోసం వాడుకోవాలి తప్ప తప్పుడు సమాచారం సృష్టించడానికి కాదు. మనం ఏది క్రియేట్ చేస్తున్నాం, ఏది షేర్ చేస్తున్నాం అన్న దానిపట్ల జాగ్రత్త వహించాలి’ అని ప్రియాంక ఘాటుగా స్పందించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870