हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

సిధ్ శ్రీరామ్ లైవ్ కాన్సర్ట్: హైదరాబాద్ ప్రేక్షకులకు మ్యూజికల్ ట్రీట్

Divya Vani M
సిధ్ శ్రీరామ్ లైవ్ కాన్సర్ట్: హైదరాబాద్ ప్రేక్షకులకు మ్యూజికల్ ట్రీట్

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సింగర్ సిధ్ శ్రీరామ్,తన మ్యూజిక్‌తో తెలుగు అభిమానులను మరింత చేరువ చేసేందుకు సిద్ధమవుతున్నారు.‘జానే జానా’వంటి ఎన్నో హిట్ పాటలతో తన మేఘమయ గాత్రం అందరినీ అలరించిన ఈ సూపర్‌హిట్ సింగర్, త్వరలో హైదరాబాద్‌లో లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 15న జరగనున్న ఈ ప్రత్యేక మ్యూజికల్ ఈవెంట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది.ఈ కాన్సర్ట్ వివరాలను తెలియజేయడానికి సిధ్ శ్రీరామ్,మూవ్78 లైవ్ సీఈఓ నితిన్ కనకరాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సిధ్ శ్రీరామ్ మాట్లాడుతూ,”తెలుగు ప్రేక్షకులు గత 10 ఏళ్లుగా నాపై అమితమైన ప్రేమ చూపిస్తున్నారు.

సిధ్ శ్రీరామ్ లైవ్ కాన్సర్ట్ హైదరాబాద్ ప్రేక్షకులకు మ్యూజికల్ ట్రీట్
సిధ్ శ్రీరామ్ లైవ్ కాన్సర్ట్ హైదరాబాద్ ప్రేక్షకులకు మ్యూజికల్ ట్రీట్

తెలుగు పాటల ద్వారానే నాకు అత్యధిక అభిమానులు ఉన్నారు.మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ చేశాను.ఇప్పుడు మళ్లీ చేయబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.నా హిట్ పాటలతో పాటు 80, 90ల మెలోడీ పాటల్ని కూడా ఈ వేడుకలో పాడతాను.ప్రస్తుతం నేను తెలుగు నేర్చుకుంటున్నాను.నాకు కాస్త సమయం ఇవ్వండి, త్వరలోనే తెలుగులో ఫ్లూయెంట్‌గా మాట్లాడతాను” అని అన్నారు.మూవ్78 లైవ్ సీఈఓ నితిన్ కనకరాజ్ మాట్లాడుతూ, “సిధ్ శ్రీరామ్‌తో మూడేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నాం.ఈ ఈవెంట్‌ను ప్రత్యేకంగా కుటుంబాలు, యువత కోసం రూపొందించాం. సిధ్ శ్రీరామ్ ఈ తరానికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

గ్రూప్ టికెట్ బుకింగ్స్‌పై డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఈవెంట్, సిధ్ అభిమానులందరికీ అందమైన అనుభూతిని అందించబోతుంది” అని తెలిపారు. సిధ్ శ్రీరామ్ తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులకు మళ్లీ మ్యూజికల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈవెంట్‌కు సంబంధించి టికెట్ వివరాలు, మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మరి, ఈ సూపర్ హిట్ లైవ్ కాన్సర్ట్ ఎలాంటి మ్యూజికల్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఫిబ్రవరి 15న, హైదరాబాద్‌లో మీ కళ్లముందే సిధ్ శ్రీరామ్ లైవ్ మ్యూజిక్ అనుభూతి కోసం సిద్ధంగా ఉండండి!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870