📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Revanth Reddy : కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా ప్రోత్సాహం ఆగదు: రేవంత్‌రెడ్డి

Author Icon By Divya Vani M
Updated: June 15, 2025 • 8:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ అభివృద్ధికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ (Gaddar Film Awards) వేడుకలో ఆయన మాట్లాడారు.1964లో ప్రారంభమైన నంది అవార్డులను గుర్తు చేశారు సీఎం. అప్పుడు అక్కినేని మొదటి అవార్డు అందుకున్నారు. ఇప్పుడు అదే తీరులో గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.ఈ ఆలోచనను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో దిల్ రాజు కీలక పాత్ర వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను అభినందించారు.తెలుగు సినిమా ఇప్పుడు దేశానికే చిరునామా అయ్యిందన్నారు. హైదరాబాదు ఆ కేంద్రంగా నిలిచిందని చెప్పారు. బాలీవుడ్ కంటే తెలుగు సినిమా ముందంజలో ఉందని తెలిపారు.

సినీ రంగాన్ని “విజన్ 2047″లో భాగం చేస్తాం

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్నారు. అందులో సినీ రంగం కీలక పాత్ర పోషించాలన్నారు. రాజమౌళిలాంటి దర్శకులు హాలీవుడ్‌ను ఇక్కడికే తేవాలన్నారు.

సినీ ప్రముఖులకే బాధ్యత అంటారు సీఎం


విజన్ 2047లో సినీ రంగానికి ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. దాన్ని రచించాల్సిన బాధ్యత సినీ ప్రముఖులదే అన్నారు. తాను ఎంతకాలైనా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.గత విభేదాలన్నీ పక్కనపెట్టి కలసి ముందుకెళ్లాలని సూచించారు. కళే ప్రజలకు చైతన్యం ఇస్తుందన్నారు. బాలకృష్ణ చెప్పిన మాటలను ఉదహరించుతూ కళ గొప్పతనాన్ని వివరించారు.ఆస్కార్ విన్నర్ రాహుల్‌ను ప్రోత్సహించాలని సీఎం భట్టికి సూచించారు. గద్దర్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Read Also : Pawan Kalyan : వీరజవాన్ కుటుంబానికి పవన్ ఆర్ధిక సాయం ఎంతంటే?

Development of Telangana Film Industry Future of Telugu Cinema Government Support to Film Industry Revanth Reddy Gaddar Awards Vision 2047 Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.