Euphoria: ‘యుఫోరియా’ మూవీ రివ్యూ

Read Time:  1 min
Euphoria: ‘యుఫోరియా’ మూవీ రివ్యూ
FONT SIZE
GET APP

ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు గుణశేఖర్.. ఈసారి రూట్ మార్చి సామాజిక బాధ్యతతో కూడిన కథను ఎంచుకున్నారు. యువతను ప్రధానంగా టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘యుఫోరియా’ (Euphoria). మరి గుణశేఖర్ మార్క్ ఈ సినిమాలో కనిపించిందా? ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను మెప్పించిందా? రివ్యూలో చూద్దాం.

Read Also: Raveena Ravi: మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో వేధింపులు: నటి

కథ

సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న చైత్ర (సారా అర్జున్) అనే అమ్మాయిని పబ్‌లో పరిచయమైన ఐదుగురు కుర్రాళ్లు తమతో పాటు కారులో తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకి చెప్పి, ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇస్తుంది చైత్ర. ఆ అమ్మాయి మైనర్ కావడంతో పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి ఐదుగురి కుర్రాళ్లని అరెస్ట్ చేస్తారు.అయితే ఈ ఐదుగురు కుర్రాళ్లు కూడా మైనర్లే.. అందులోనూ సమాజంలో పలుకుబడి ఉన్న పెద్ద కుటుంబాలకి సంబంధించిన పిల్లలు.

'Euphoria' Movie Review
‘Euphoria’ Movie Review

అందులో ప్రముఖ విద్యా సంస్థల ప్రిన్సిపల్ వింద్య వేములపల్లి (భూమిక) కొడుకు వికాశ్ (విఘ్నేష్ గవిరెడ్డి) కూడా ఉంటాడు. అయితే పిల్లలకి పాఠాలు చెప్పే వింద్య తన కొడుకుతో పాటు తప్పు చేసిన మిగిలిన నలుగురికి కూడా గుణపాఠం చెప్తుంది. ఈ కేసుని డీల్ చేస్తున్న సిటీ కమిషనల్ జయదేవ్‌ (గౌతమ్ మీనన్)‌కి కీలక ఆధారం అప్పగించి ఆ ఐదుగురికి శిక్ష పడేలా చేస్తుంది.అయితే జైలు జీవితం గడుపుతున్న వికాశ్‌లో మార్పు వచ్చిందా? తన కొడుకుని సరైన మార్గంలో పెట్టలేకపోయినందుకు వింద్య ఎంత బాధపడింది? చివరికి కొడుకుని పెరోల్ మీద తీసుకొచ్చిన వింద్య అసలు లక్ష్యం నెరవేరిందా? అనేది మిగిలిన కథ.

కథనం

డ్రగ్స్ అనే మహమ్మారి యువత భవిష్యత్తును ఎలా చిదిమేస్తోంది, ఆ మత్తులో వారు చేసే తప్పుల వల్ల తల్లిదండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తున్నారు అనే పాయింట్‌ను గుణశేఖర్ బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్ రేప్ కేసు వంటి వాస్తవ ఘటనల ఆధారంగా కథను అల్లుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దర్శకుడు కథ (Euphoria) ను దాచి పెట్టకుండా ట్రైలర్‌లోనే అసలు విషయం చెప్పేశారు. అయితే దాన్ని తెరపై ఎంత ఆసక్తికరంగా మలిచారనేదే ఇక్కడ కీలకం. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.